శనివారం 11 జూలై 2020
National - Jun 17, 2020 , 17:14:33

చైనా విదేశాంగ మంత్రితో మాట్లాడిన జైశంక‌ర్‌..

చైనా విదేశాంగ మంత్రితో మాట్లాడిన జైశంక‌ర్‌..

హైద‌రాబాద్‌: ఈస్ట్ర‌న్ ల‌డ‌ఖ్‌లో నెల‌కొన్న ఉద్రిక్త ప‌రిస్థితిపై చైనా విదేశాంగ శాఖ మంత్రి వాంగ్ వైయితో ఇవాళ భార‌త విదేశాంగ శాఖ మంత్రి జైశంక‌ర్ ఫోన్‌లో మాట్లాడారు.  ప్ర‌స్తుతం గాల్వ‌న్ వ్యాలీలో నెల‌కొన్న ప‌రిస్థితిపై వారు చ‌ర్చించుకున్నారు.  స‌మ‌స్య‌ను సామ‌ర‌స్య‌పూర్వంగా ప‌రిష్క‌రించేందుకు ఇరు దేశాలు అంగీక‌రించిన‌ట్లు చైనా విదేశాంగ శాఖ పేర్కొన్న‌ది. వీలైనంత త్వ‌ర‌గా ఉద్రిక్త‌త‌లు త‌గ్గించే ప్ర‌య‌త్నం చేస్తున్న‌ట్లు చైనా చెప్పింది.  చైనా ముందుగా ప్లాన్ చేసిన ప్ర‌కారం గాల్వన్‌లో భార‌తీయ సైనికులపై దాడి చేసిన‌ట్లు జైశంక‌ర్ తెలిపారు. దాని వ‌ల్లే అక్క‌డ తీవ్ర ప‌రిణామాలు చోటుచేసుకున్న‌ట్లు ఆయ‌న చైనాతో వెల్ల‌డించారు. 

భార‌త‌, చైనా దేశాలు సంయ‌మ‌నం పాటించాల‌ని యురోపియ‌న్ యూనియ‌న్ కోరింది. ఎల్ఏసీ వ‌ద్ద జ‌రుగుతున్న ఘ‌ర్ష‌ణాత్మ‌క వాతావ‌ర‌ణంపై ఈయూ స్పందించింది.  సంయ‌మ‌నం పాటించి, సైనిక ఉద్రిక్త‌త‌ల‌ను త‌గ్గించుకోవాల‌ని రెండు దేశాల‌ను ఈయూ ప్ర‌తినిధి వ‌ర్జిని బాట్టు హెన్రిక్‌స‌న్ కోరారు. 


logo