శుక్రవారం 22 జనవరి 2021
National - Jan 12, 2021 , 13:40:39

వ్యాక్సిన్ ఎగుమ‌తుల‌పై త్వ‌ర‌లోనే స్ప‌ష్టత‌: ‌కేంద్రం

వ్యాక్సిన్ ఎగుమ‌తుల‌పై త్వ‌ర‌లోనే స్ప‌ష్టత‌: ‌కేంద్రం

న్యూఢిల్లీ: దేశీయంగా త‌యారైన కొవిడ్ టీకాల‌ను భార‌త్ త్వ‌ర‌లోనే విదేశాలకు ఎగుమ‌తి చేయ‌నుంద‌ని విదేశాంగ మంత్రి జై శంక‌ర్ తెలిపారు. భారత్‌ నుంచి ఇతర దేశాలకు కరోనా వ్యాక్సిన్‌ ఎగుమతుల‌పై కొన్ని వారాల్లో స్ప‌ష్ట‌త రానుంద‌ని ఆయ‌న చెప్పారు. వ్యాక్సిన్‌ల‌‌ ఎగుమతులపై కేంద్రానికి స్పష్టత ఉందని పేర్కొన్నారు. త‌మ దేశాల్లో ప్రజలకు వ్యాక్సిన్‌ అందించాలన్న ఇతర దేశాల ఆందోళనను భారత్‌ అర్థం చేసుకుందని జైశంక‌ర్ వెల్ల‌డించారు. దేశవ్యాప్తంగా ఎంతమేర వ్యాక్సిన్‌లను వినియోగించాలనే దానిపై త్వరలోనే ఒక అవ‌గాహ‌న‌ వస్తుందని, అనంతరం ఎగుమతులు ఎంతమేర‌కు చేయాల‌నే విష‌యంలో క్లారిటీ రానుంద‌ని చెప్పారు. 

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.


logo