శుక్రవారం 03 జూలై 2020
National - Jun 18, 2020 , 02:00:10

పథకం ప్రకారమే దాడి

పథకం ప్రకారమే దాడి

న్యూఢిల్లీ: గల్వాన్‌లో భారత సైనికులపై చైనా సైనికులు ముందస్తు పథకం ప్రకారమే దాడిచేశారని విదేశాంగమంత్రి ఎస్‌ జైశంకర్‌ పేర్కొన్నారు. చైనా విదేశాంగమంత్రి వాంగ్‌ ఈతో బుధవారం ఫోన్లో మాట్లాడారు. చైనా సైన్యం ఇలాంటి చర్యలు మానుకోకపోతే ద్వైపాక్షిక సంబంధాలు తీవ్రంగా దెబ్బతింటాయని హెచ్చరించారు. చైనా తన తప్పులను సరిదిద్దుకోవాలని సూచించారు. ఈ నెల 6న జరిగిన ఒప్పందం ప్రకారం సైన్యాలను ఉపసంహరించాలని నిర్ణయించారు.


logo