శుక్రవారం 10 ఏప్రిల్ 2020
National - Feb 11, 2020 , 11:38:17

రొమాంటిక్‌గా టిక్‌టాక్‌ వీడియో.. నగ్నంగా ఊరేగించారు..

రొమాంటిక్‌గా టిక్‌టాక్‌ వీడియో.. నగ్నంగా ఊరేగించారు..

జైపూర్‌ : టిక్‌టాక్‌ వీడియోలకు విపరీతమైన క్రేజ్‌ ఉంది. దీంతో యువతీ యువకులు వినూత్నంగా టిక్‌టాక్‌ వీడియోలను సృష్టిస్తున్నారు. తన స్నేహితురాలితో ఓ మైనర్‌ రొమాంటిక్‌గా టిక్‌టాక్‌ వీడియో చేసి అభాసుపాలయ్యాడు. ఆ బాలుడిని బాలిక తరపు కుటుంబ సభ్యులు నగ్నంగా ఊరేగించారు. ఈ ఘటన రాజస్థాన్‌ రాజధాని జైపూర్‌లో ఈ నెల 7న చోటు చేసుకోగా ఆలస్యంగా వెలుగు చూసింది. ఓ మైనర్‌తో ఆమె స్నేహితుడు.. రొమాంటిక్‌గా టిక్‌టాక్‌ వీడియో చేసి వైరల్‌ చేశాడు. ఆ వీడియోను బాలిక సోదరుడు చూసి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. సదరు బాలుడిని పట్టుకుని తీవ్రంగా చితకబాదాడు. అంతటితో ఆగకుండా అతడిని నగ్నంగా ఊరేగించారు. ఈ వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అయ్యాయి. అవమానం భరించలేని బాలుడి కుటుంబ సభ్యులు శనివారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇక బాలిక కుటుంబ సభ్యులు కూడా ఆ అబ్బాయిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఇరు కుటుంబాల సభ్యులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.


logo