ఆదివారం 09 ఆగస్టు 2020
National - Jul 23, 2020 , 12:48:43

కేంద్ర‌మంత్రి గజేంద్ర శేఖావత్‌పై దర్యాప్తుకు జైపూర్ కోర్టు ఆదేశం

కేంద్ర‌మంత్రి గజేంద్ర శేఖావత్‌పై దర్యాప్తుకు జైపూర్ కోర్టు ఆదేశం

జైపూర్ : క‌్రెడిట్ సొసైటీ కుంభ‌కోణం కేసులో కేంద్ర‌మంత్రి గ‌జేంద్రసింగ్ శేఖావ‌త్ ప్ర‌మేయంపై రాజ‌స్థాన్ పోలీసులు ద‌ర్యాప్తు చేయాల్సిందిగా సిటీ కోర్టు ఆదేశించింది. అశోక్ గెహ్లాట్ ప్రభుత్వాన్ని కూల్చివేసే ప్రయత్నంలో మంత్రి పాల్గొన్నారని కాంగ్రెస్ పార్టీ ఇప్ప‌టికే ఆరోపిస్తున్న సంగ‌తి తెలిసిందే. కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యేల‌ను బ‌య‌ట‌కు లాగేందుకు మంత్రి చేప‌ట్టిన బేర‌సారాల ఆడియో క్లిప్‌ల‌పై స్పెష‌ల్ ఆప‌రేష‌న్ గ్రూప్‌(ఎస్ఓజీ) ఇప్ప‌టికే మంత్రికి నోటీసులు జారీ చేసింది.

మంగళవారం అదనపు జిల్లా న్యాయమూర్తి పవన్ కుమార్ బిజెపి నాయకుడిపై అందిన‌ ఫిర్యాదును ఎస్ఓజీకి పంపాలని అదనపు చీఫ్ జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ కోర్టును ఆదేశించారు. సంజీవని క్రెడిట్ కోఆపరేటివ్ సొసైటీ కుంభకోణంలో షెఖావ‌త్‌తో పాటు ఆయ‌న భార్య పేరు ఉంది. వేలాది మంది పెట్టుబడిదారులు సుమారు రూ. 900 కోట్లు నష్టపోయారు. ఎస్ఓజీ జైపూర్ యూనిట్ గత సంవత్సరం నుండి ఈ కుంభకోణంపై దర్యాప్తు చేస్తోంది.

23 ఆగస్టు, 2019న కుంభ‌కోణంపై ఎఫ్ఐఆర్ నమోదైంది. కాగా కేసుకు సంబంధించి చార్జిషీట్‌లో షెఖావ‌త్ పేరును ఎస్‌ఓజి ప్ర‌స్తావించ‌లేదు. మేజిస్ట్రేట్ కోర్టు కూడా ఛార్జిషీట్‌లో అత‌ని పేరును చేర్చే ద‌ర‌ఖాస్తును తిర‌స్క‌రించింది. దీంతో దరఖాస్తుదారులు అదనపు జిల్లా న్యాయమూర్తి కోర్టును ఆశ్రయించారు. 


logo