ఆదివారం 17 జనవరి 2021
National - Dec 27, 2020 , 01:23:59

ఎంబీబీఎస్‌లో చేరాడు!

ఎంబీబీఎస్‌లో చేరాడు!

  • బ్యాంక్‌ రిటైర్డ్‌ ఉద్యోగి..

భువనేశ్వర్‌: ఒడిశాకు చెందిన జయ్‌కిశోర్‌ ప్రధాన్‌ ఈ ఏడాది నీట్‌లో మంచి ర్యాంకు సాధించారు. వీర్‌ సురేంద్రసాయి యూనివర్సిటీలో ఎంబీబీఎస్‌ మొదటి సంవత్సరంలో విద్యార్థిగా చేరారు. దీంట్లో వింతేముంది.. ఏటా వేలాది మంది నీట్‌ పాసై ఎంబీబీఎస్‌ చేస్తారు కదా.. అనుకుంటున్నారా. అవును నిజమే. కానీ 64 ఏండ్ల వయస్సులో నీట్‌లో ర్యాంకు సాధించి ఎంబీబీఎస్‌ చేయడం గొప్ప విషయమే కదా. జయ్‌కిశోర్‌ వయస్సు 64 ఏండ్లు. స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్బీఐ)లో ఉద్యోగం చేశారు. ఇటీవలే పదవీవిరమణ చేశారు. తర్వాత సెప్టెంబర్‌లో నీట్‌ రాశారు. తాను డబ్బుల కోసం ఎంబీబీఎస్‌ చేయడం లేదని, బతికున్నంత వరకు ప్రజలకు సేవ చేయడమే తన లక్ష్యమని ఆయన చెప్పారు.