మంగళవారం 02 మార్చి 2021
National - Jan 23, 2021 , 22:03:48

జై శ్రీ‌రాం అంటే త‌ప్పేంటి: నేతాజీ మ‌నుమ‌డు

జై శ్రీ‌రాం అంటే త‌ప్పేంటి: నేతాజీ మ‌నుమ‌డు

కోల్‌క‌తా: ‌నేతాజీ సుభాష్ చంద్ర‌బోస్ జ‌యంతి సంద‌ర్భంగా విక్టోరియా మెమోరియ‌ల్‌లో జ‌రిగిన స‌భ‌లో కొంద‌రు భ‌జ‌రంగ్ ద‌ళ్ కార్య‌క‌ర్త‌లు జై శ్రీ‌రాం అన్నందుకు ప‌శ్చిమ బెంగాల్ సీఎం మ‌మ‌తాబెన‌ర్జీ ఆగ్ర‌హం వ్య‌క్తం చేయ‌డంపై నేతాజీ మ‌నుమ‌డు, బీజేపీ నేత చంద్ర కుమార్ బోస్ స్పందించారు. ప్ర‌ధాని న‌రేంద్ర‌మోదీ కూడా పాల్గొన్న ఈ స‌భ‌లో జై హింద్ అన్నా, జై శ్రీ‌రాం అన్నా అంత అలెర్జిక్‌గా స్పందించాల్సిన అవ‌స‌రం ఏమీ లేద‌న్నారు. 

ఇది రాజ‌కీయాలు చేయాల్సిన స‌మ‌యం కాదు. ఇండియ‌న్ నేష‌న‌ల్ ఆర్మీ సైనికుల‌కు, అమ‌ర‌వీరుల‌కు నివాళుల‌ర్పించాల్సిన రోజు అని చంద్ర‌కుమార్ బోస్ గుర్తు చేశారు. నేతాజీ సుభాష్ చంద్ర‌బోస్ ఐక్య‌త కోసం నిల‌బ‌డ్డార‌న్నారు. అన్ని సామాజిక వ‌ర్గాల వారు ఆజాద్ హిందూ ఫౌజ్‌లో స‌భ్యులుగా ఉన్నార‌ని చంద్ర‌కుమార్ బోస్ గుర్తు చేశారు. అలెర్జిక్‌గా ప్ర‌తిస్పందించ‌డానికి జై శ్రీ‌రాం అనే ప‌దం ఒక ప్ర‌క‌ట‌న కాద‌ని వ్యాఖ్యానించారు. 

ఇదిలా ఉంటే అధికార త్రుణ‌మూల్ కాంగ్రెస్ ఎంపీ మాహువా మొయిత్రా.. త‌మ అధినేత వైఖ‌రిని స‌మ‌ర్ధించారు. లౌకిక ప్ర‌జాస్వామ్యం గ‌ల ప్ర‌భుత్వ అధికార కార్య‌క్ర‌మంలో మ‌త‌ప‌ర‌మైన నినాదాలు చేయ‌కూడ‌ద‌న్నారు. ప‌నికిమాలిన వారు, నిర‌క్ష‌రాస్యులు మాత్ర‌మే ఇటువంటి చ‌ర్య‌ల‌కు పాల్ప‌డ‌తార‌ని చెప్పారు. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

VIDEOS

logo