ఆదివారం 05 జూలై 2020
National - Jun 22, 2020 , 18:18:46

భక్తులు లేకుండానే జగన్నాథ రథయాత్ర

భక్తులు లేకుండానే జగన్నాథ రథయాత్ర

న్యూఢిల్లీ : కరోనా వ్యాప్తి నేపథ్యంలో పూరీ జగన్నాథ రథయాత్రకు సుప్రీంకోర్టు స్టే విధించింది. జూన్‌ 23న యాత్ర నిర్వహించకుంటే 12ఏళ్ల పాటు వాయిదా వేయాల్సి వస్తుందని, యాత్ర నిర్వహించేందుకు అనుమతి ఇవ్వాలని కేంద్రం సుప్రీంకోర్టును కోరింది. దీనికి ఒడిశా ప్రభుత్వం కూడా మద్దతు తెలిపింది. దీనిపై స్పందించిన కోర్టు తమ ఆదేశాలను పునర్‌ సమీక్షించింది. జగన్నాథ రథయాత్రకు అనుమతిస్తూ జస్టిస్ ఎస్ఏ బాబ్డే నేతృత్వంలోని దినేష్ మహేశ్వరి, ఏఎస్ బోపన్నలతో కూడిన ధర్మాసనం సోమవారం మధ్యాహ్నం తీర్పు వెలువరించింది.

అయితే రాష్ట్ర, ఆలయ కమిటీ సహకారంతో రథయాత్ర నిర్వహించవచ్చని కేంద్రానికి తెలియజేసింది. కరోనా వ్యాప్తి కారణంగా భక్తులు లేకుండానే యాత్ర నిర్వహించాలని సూచించింది. కేవలం పూరీలో మాత్రమే జగన్నాథ రథ యాత్ర నిర్వహించాలని, ఈ రథయాత్రకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకోవాలని సూచించింది. రథ యాత్రను ప్రత్యక్ష ప్రసారం చేయాలని ఆదేశించింది.


logo