శుక్రవారం 07 ఆగస్టు 2020
National - Jul 24, 2020 , 01:27:42

ఈ ఏడాది జగన్నాథ రథాలు..మ్యూజియంలోకి

ఈ ఏడాది జగన్నాథ రథాలు..మ్యూజియంలోకి

భువనేశ్వర్‌: ఏండ్లుగా వస్తున్న సంప్రదాయానికి భిన్నంగా ఈ ఏడాది జగన్నాథ రథాలను ధ్వంసం చేయకుండా భద్రపర్చనున్నారు. ప్రతీ ఏడాది పూరీలో రథయాత్ర ముగిసిన తర్వాత కర్రతో చేసిన ఈ మూడు రథాలను ధ్వంసం చేస్తారు. ఆ తర్వాత ఆలయంలోనే వంటచెరుకుగా వాడతారు. అయితే ఈ ఏడాది మాత్రం అలా చేయకూడదని ఆలయ అధికారులు నిర్ణయించారు. కరోనా కాలంలోనూ వడ్రంగులు, ఇతర పనివారు రికార్డు సమయంలో రథాలను తయారు చేశారని, వారి కృషికి గుర్తింపుగా ఈ మూడు రథాలను మ్యూజియంలో పెడతామని ఆలయ ముఖ్య పాలనాధికారి కృష్ణన్‌ కుమార్‌ తెలిపారు.


logo