ఆదివారం 31 మే 2020
National - May 14, 2020 , 15:30:04

ఆ ప‌న‌స‌పండు బ‌రువు తెలిస్తే షాక‌వ్వాల్సిందే..

ఆ ప‌న‌స‌పండు బ‌రువు తెలిస్తే షాక‌వ్వాల్సిందే..

హైద‌రాబాద్‌: వామ్మో. ఈ ప‌న‌స‌ను చూశారా.  ఎంత పెద్ద సైజ్‌లో ఉన్న‌దో.  చూస్తుంటే.. తినాల‌నిపిస్తుందా. కానీ దీని వెయిట్  తెలుస్తే మాత్రం.. షాక్ అవ్వాల్సిందే.  మ‌హాభారీ ఆకారంలో ఉన్న ఈ ప‌న‌స బ‌రువు 51.4 కేజీలు.  ఇది కేర‌ళ‌లోని కొల్లామ్‌లో ఉన్న ఓ తోట‌లో పండింది.  ఆ తోట ఓన‌ర్ ఈ పండును చూసి తెగ సంబ‌ర‌ప‌డిపోయాడు. జానీకుట్టి ఇంట్లో ఉన్న తోట‌లో ఈ పండును గుర్తించారు.  ఇప్ప‌టి వ‌ర‌కు ఇండియాలో అత్యంత బ‌రువున్న ప‌న‌స‌పండు పుణెలో రికార్డు అయ్యింది. దాని బ‌రువు 42.72 కేజీలుగా ఉన్న‌ది. కానీ ఇప్పుడు ఆ బ‌రువును ఇది బీట్ చేసింది. అంతేకాదు,  కేర‌ళ‌ తోట య‌జ‌మాని.. త‌న జాక్‌ఫ్రూట్ కోసం గిన్నిస్ బుక్ కోసం ద‌ర‌ఖాస్తు పెట్టుకున్నాడు.  లిమ్కా బుక్స్ ఆఫ్ రికార్డ్స్‌కు కూడా ద‌ర‌ఖాస్తు చేసుకున్న‌ట్లు చెప్పాడు.  


logo