బుధవారం 08 ఏప్రిల్ 2020
National - Mar 01, 2020 , 19:06:54

సింహంతోకనే పట్టుకున్న నక్క..వీడియో

సింహంతోకనే పట్టుకున్న నక్క..వీడియో

సాధారణంగా కొంతమంది చేసే ప్రాంక్‌ వీడియోలు ఎంతో నవ్వుతెప్పిస్తాయి. జంతు ప్రపంచంలోనైతే సహజసిద్దంగా కొన్నిసార్లు జంతువుల మధ్య హాస్యభరిత సన్నివేశాలు కనిపిస్తుంటాయి. ఓ ఫారెస్ట్‌లో మృగరాజు చెట్ల పొదల పక్కనే పడుకుంది. నక్క ఆ సింహం దగ్గరకు వచ్చింది. ఆ నక్క ఒక్కసారిగా సింహం తోకను పట్టుకోవడంతో..ఆ సింహం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. దీంతో నక్క వెంటనే అక్కడి నుంచి తుర్రుమని పారిపోయింది. 8 సెకన్లకాలంలో జరిగిన ఈ ఫన్నీ వీడియో అందరికీ నవ్వులు తెప్పిస్తోంది. ఈ వీడియోను ఐఎఫ్‌ఎస్‌ అధికారి రమేశ్‌ పాండే ట్విట్టర్‌లో షేర్‌ చేశారు.logo