ఆదివారం 31 మే 2020
National - May 07, 2020 , 19:54:50

త్వరలో పెళ్లి పీట‌లెక్కనున్న జబర్‌దస్త్‌ మ‌హేశ్!

త్వరలో పెళ్లి పీట‌లెక్కనున్న జబర్‌దస్త్‌ మ‌హేశ్!

తూర్పు గోదావ‌రి జిల్లాలోని మారుమూల గ్రామానికి చెందిన మ‌హేశ్‌కుజబర్‌దస్త్‌ కామెడీ షోతో గుర్తింపు ల‌భించింది. ఆర్పీ టీంలో మ‌హేశ్ కంటెస్టెంట్‌గా చేరాడు. జబర్‌దస్త్‌ లో త‌న ప్రతిభను గుర్తించిన‌ డైరెక్టర్లు సినిమాల్లో ఆఫ‌ర్లు ఇవ్వడం మొద‌లుపెట్టారు. రంగ‌స్థలం, శ‌త‌మానం భ‌వ‌తి వంటి సినిమాల్లో హీరోకు స్నేహితుడిగా న‌టించి మెప్పించాడు. రంగ‌స్థలం చిత్రంతో మ‌హేశ్‌కు మంచి పేరు వ‌చ్చింది. ఇప్పుడిప్పుడే కెరీర్‌లో ఎదుగుతున్న మ‌హేశ్ త్వరలో పెళ్లి చేసుకోబోతున్నాడు. రీసెంట్‌గానే మ‌హేశ్‌కు పెళ్లి కుదిరింది. లాక్‌డౌన్ పూర్తయ్యాక పెళ్లి జ‌రుగబోతున్నట్లుగా తెలుస్తుంది. త‌న‌కు కాబోయే భార్యతో ఉన్న ఫొటోలు సోష‌ల్‌ మీడియాలో హ‌ల్‌చ‌ల్ చేస్తున్నాయి. ఫొటోలు చూసిన వారంతా మ‌హేశ్‌కు కంగ్రాట్స్ చెబుతూ కామెంట్లు పెడుతున్నారు. 


logo