మంగళవారం 11 ఆగస్టు 2020
National - Jul 31, 2020 , 19:45:29

గృహ నిర్బంధం నుంచి పీపుల్స్ కాన్ఫరెన్స్ నాయకుడు సజ్జాద్ విడుదల

గృహ నిర్బంధం నుంచి పీపుల్స్ కాన్ఫరెన్స్ నాయకుడు సజ్జాద్ విడుదల

జమ్ము కశ్మీర్‌ : ఆరు నెలల గృహ నిర్బంధం నుంచి పీపుల్స్‌ కాన్ఫరెన్స్‌ నాయకుడు, ఎమ్మెల్యే సజ్జాద్‌ లోన్‌ విడుదలయ్యారు. గతేడాది ఆర్టికల్ 370ని కేంద్రం రద్దు చేస్తున్న తరుణంలో ఆయనను అదుపులోకి తీసుకుని ఆరునెలలపాటు ఎమ్మెల్యే హాస్టల్లో ఉంచారు.  ఆ తరువాత 2019 ఫిబ్రవరి 5న చర్చి లేన్‌లోని  ప్రభుత్వ వసతి గృహానికి మార్చారు. సజ్జాద్‌లోన్‌ విడుదల సందర్భంగా నేషనల్‌ కాన్ఫరెన్స్‌ నాయకుడు ఒమర్‌ అబ్దుల్లా  ట్విట్టర్‌లో స్పందించారు. 

‘అక్రమ గృహ నిర్బంధం నుంచి సజ్జాద్‌ లోన్‌ విడుదలయ్యాడని విని సంతోషిస్తున్న. ఇదేరీతిలో నిర్బంధించిన అందరి నేతలను ఆలస్యం చేయకుండా విడుదల చేస్తారని ఆశిస్తున్న’ అంటూ ఆయన పేర్కొన్నారు. జమ్ము కశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తి నిచ్చే ఆర్టికల్ 370ని రద్దు చేసే క్రమంలో హింసకు తావులేకుండా పలువురు పీపుల్స్‌ కాన్ఫరెన్స్‌ నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. జమ్ముకశ్మీర్, లడక్‌లను  కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజించిన సంగతి తెలిసిందే.


logo