బుధవారం 02 డిసెంబర్ 2020
National - Oct 24, 2020 , 20:35:23

పీడీపీ కార్యాలయంపై దాడి

పీడీపీ కార్యాలయంపై దాడి

శ్రీనగర్‌: జమ్ముకశ్మీర్‌కు చెందిన పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ (పీడీపీ)పై శనివారం దాడి జరిగింది. జమ్ములోని పార్టీ కార్యాలయంలోకి కొందరు ప్రవేశించి దాడి చేసినట్లు పీడీపీ నేత ఫిర్దౌస్ తక్ ఆరోపించారు. కార్యాలయంలో ఉన్న పార్టీ కార్యకర్తలను కొట్టారని, అసభ్యంగా మాట్లాడుతూ త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసేందుకు ప్రయత్నించారని చెప్పారు. ఒక రంగు దుస్తులు ధరించిన వారు బీజేపీ కార్యకర్తలేనని ఆయన అనుమానం వ్యక్తం చేశారు. రేపు మళ్లీ వస్తామని, పార్టీ కార్యాలయాన్ని నేల మట్టం చేస్తామని హెచ్చరించారని ఫిర్దౌస్ ఆరోపించారు. జమ్ముకశ్మీర్‌ పాలనా యంత్రాంగం, పోలీసులకు ఈ విషయం గురించి చెప్పినా వారు స్పందించలేదని ఆయన విమర్శించారు. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.