శుక్రవారం 04 డిసెంబర్ 2020
National - Oct 21, 2020 , 22:04:47

జమ్ముకశ్మీర్‌లో 4 జీ సేవలపై నిషేధం పొడిగింపు

జమ్ముకశ్మీర్‌లో 4 జీ సేవలపై నిషేధం పొడిగింపు

శ్రీనగర్‌ : జమ్ముకశ్మీర్ కేంద్ర పాలిత ప్రాంతంలో 4 జీ ఇంటర్నెట్ సేవలపై నిషేధాన్ని నవంబర్ 12 వరకు పొడిగించారు. గండర్‌బాల్, ఉధంపూర్ జిల్లాలను దీని నుంచి మినహాయించారు. ఈ విషయం బుధవారం

జమ్ముకశ్మీర్ అధికారులు జారీ చేసిన నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు. గండర్‌బాల్, ఉధంపూర్ జిల్లాల్లో హై-స్పీడ్ మొబైల్ డేటా సేవలు అందుబాటులో ఉంచడం కొనసాగిస్తారు. మిగిలిన జిల్లాల్లో ఇంటర్నెట్ వేగం 2 జీకి మాత్రమే పరిమితం చేయనున్నట్లు నోటిఫికేషన్‌లో తెలిపారు. పోస్ట్‌పెయిడ్ సిమ్ కార్డుదారులకు ఇంటర్నెట్‌కు ప్రాప్యత అందించడం కొనసాగుతుండగా, పోస్ట్-పెయిడ్ కనెక్షన్‌లకు వర్తించే నిబంధనల ప్రకారం ధ్రువీకరించకపోతే ఈ సేవలు ప్రీ-పెయిడ్ కార్డుల్లో అందుబాటులో ఉండవని నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు.

తొలుత జమ్ముకశ్మీర్‌లో 4జీ ఇంటర్నెట్ సేవలపై నిషేధాన్ని సెప్టెంబర్ 30 నుంచి అక్టోబర్ 21 వరకు పొడిగించారు. గత ఏడాది ఆగస్టు 5 న ఆర్టికల్ 370 రద్దు చేసినప్పటి నుంచి ఆరు నెలల దిగ్బంధనం అనంతరం జమ్ముకశ్మీర్‌ అధికారులు.. ప్రీపెయిడ్, పోస్ట్‌పెయిడ్ ఫోన్లో 2 జీ మొబైల్ ఇంటర్నెట్‌ను అనుమతించారు. జమ్ముకశ్మీర్‌లో ఉన్న ఆంక్షలను సమీక్షించాలని జనవరి 10 న సుప్రీంకోర్టు అధికారులను కోరిన తరువాత.. రాజ్యాంగంలోని ఆర్టికల్ 19 ప్రకారం ఇంటర్నెట్ యాక్సెస్ ప్రాథమిక హక్కు అని గమనించిన తరువాత ఈ మార్పులు చోటుచేసుకున్నాయి.

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.