సోమవారం 03 ఆగస్టు 2020
National - Jul 12, 2020 , 15:54:54

పుల్వామాలో రూ. 91.91 కోట్లతో అభివృద్ధి ప్రాజెక్టుల ప్రారంభం

పుల్వామాలో రూ. 91.91 కోట్లతో అభివృద్ధి ప్రాజెక్టుల ప్రారంభం

పుల్వామా: జమ్మూకశ్మీర్‌లోని పుల్వామాలో లెఫ్ట్‌నెంట్‌ గవర్నర్‌ గిరీశ్‌చంద్ర ముర్ము ఆదివారం 91.91 కోట్ల రూపాయల విలువైన అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించారు. ఈ మేరకు జమ్మూకశ్మీర్ ప్రభుత్వ సమాచార, ప్రజా సంబంధాల శాఖ ట్వీట్ చేసింది. అనంతరం ముర్ము వివిధ ప్రతినిధులు, ప్రజా ప్రతినిధులతో సంభాషించినట్ల తెలిపింది. సమగ్ర అభివృద్ధిని సాధించేందుకు, ప్రణాళిక రచనలో ప్రజల భాగస్వామ్యం అవసరమని ముర్ము అభిప్రాయపడ్డారని పేర్కొంది. అనంతరం ఆయన  వ్యవసాయానికి సంబంధించిన ప్రభుత్వ కార్యక్రమాల గురించి రైతులకు అవగాహన కల్పించేందుకు కిసాన్‌ మేళాను కూడా ప్రారంభించారు. 


లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.


logo