ఆదివారం 24 జనవరి 2021
National - Jan 10, 2021 , 18:56:35

కశ్మీర్‌లో ఉగ్రవాదుల రహస్య స్థావరం గుర్తింపు

కశ్మీర్‌లో ఉగ్రవాదుల రహస్య స్థావరం గుర్తింపు

శ్రీనగర్‌: జమ్ముకశ్మీర్‌లోని అవంతిపోరా పోలీసులు ఉగ్రవాదులకు చెందిన ఒక రహస్య స్థావరాన్ని గుర్తించారు. లష్కరే తయిబాకు చెందిన ఉగ్రవాదులు పాంపూర్‌లోని ఒక ఇంటి వద్ద రహస్య స్థావరాన్ని ఏర్పాటు చేసుకున్నట్లు అవంతిపోరా పోలీసులకు సమాచారం అందింది. దీంతో 50 ఆర్‌ఆర్, 110 బెటాలియన్‌కు చెందిన సిఆర్‌పిఎఫ్‌ జవాన్లతో కలిసి ఆదివారం పాంపూర్‌లో ఒక ఇంటి వద్ద తనిఖీ చేశారు. ఆ ఇంటి ఆవరణలోని గోశాల వద్ద ఉన్న రహస్య స్థావరాన్ని ఈ సందర్భంగా గుర్తించారు. ఒక ఉగ్రవాదిని అదుపులోకి తీసుకున్నారు. నిషేధిత వస్తువులు, ఏకే -47లో వినియోగించే 26 రౌండ్ల బుల్లెట్లను ఈ రహస్య స్థావరం నుండి స్వాధీనం చేసుకున్నారు. చట్టవిరుద్ధ కార్యకలాపాలు (నివారణ) చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.  

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo