గురువారం 09 ఏప్రిల్ 2020
National - Feb 26, 2020 , 17:07:38

అనార్క‌లీ లుక్‌లో.. వావ్‌ ఇవాంకా

అనార్క‌లీ లుక్‌లో.. వావ్‌ ఇవాంకా

హైద‌రాబాద్‌:  ఇవాంకా ట్రంప్‌.. అనార్క‌లీ లుక్‌లో అద‌ర‌గొట్టింది.  రాష్ట్ర‌ప‌తిభ‌వ‌న్‌లో ఏర్పాటు చేసిన విందుకు.. అమెరికా అధ్య‌క్షుడు డోనాల్డ్ ట్రంప్ కుమార్తె ఇవాంకా ట్రంప్‌.. ఐవ‌రీ అనార్క‌లీ డ్రెస్సులో హాజ‌రైంది. పాల‌రాతి బొమ్మ‌లాగా.. ఆ ఈవెంట్‌లో అంద‌ర్నీ అట్రాక్ట్ చేసింది.  భ‌ర్త జేర్డ్ కుష్న‌ర్‌తో వ‌చ్చిన ఇవాంకా.. అనార్క‌లీ డ్రెస్సులో మ‌రింత రొమాంటిక్‌గా క‌నిపించింది.  రాష్ట్ర‌ప‌తి భ‌వ‌న్‌లో ఇవాంకా అటూ ఇటూ తిరిగింది. ఆ స‌మ‌యంలో వైట్‌హౌజ్ ఫోటోగ్రాఫర్ షీలా క్రెయిడ్‌హెడ్ తీసిన కొన్ని ఫోటోల‌ను ఇవాంకా త‌న ట్విట్ట‌ర్‌లో పోస్టు చేసింది.  ఫుల్ లెన్త్ డ్రెస్సులో ఉన్న ఇవాంకా.. బ్లాక్ అండ్ వైట్ ఫోటోను కూడా త‌న ట్విట్ట‌ర్‌లో పోస్టు చేసింది.  ఆ ఫోటోలో క్వీన్‌ ఇవాంకా.. నిజంగానే అనార్క‌లీని మైమ‌రిపించింది.  ఇండియ‌న్ డిజైన‌ర్ రోహిత్‌బ‌ల్ .. ఆ సూట్‌ను డిజైన్ చేశాడు.  ఐవ‌రీ రంగులో ఉన్న సూట్‌పై గులాబీలు పొదిగిన ఆ డిజైన్‌ను అనార్క‌లీ లుక్‌గా పిలుస్తారు. బంద్‌గ‌లా స్టైయిల్‌లో కాల‌ర్ ఉంది. స్లీవ్స్‌పై గోల్డ్‌వైర్ల త‌ర‌హాలో ఇచ్చిన డిజైన్ కూడా ఆక‌ట్టుకుంటున్న‌ది.  గుల్‌ద‌స్తాన్ క‌లెక్ష‌న్ నుంచి ఈ అనార్క‌లీ డిజైన్‌ను క్రియేట్ చేశారు. ఆ ఐవ‌రీ క‌ల‌ర్ సూట్‌లో క‌శ్మీర్ అందాలు దాగి ఉన్న‌ట్లుగా గులాబీల‌ను అమ‌ర్చి దాన్ని డిజైన్ చేశారు.  2018లో ఈ డిజైన్‌ను రిలీజ్ చేశారు. 
logo