శనివారం 04 ఏప్రిల్ 2020
National - Feb 21, 2020 , 14:08:28

ఇవాంకా ట్రంప్ వ‌స్తోంది..

ఇవాంకా ట్రంప్ వ‌స్తోంది..

హైద‌రాబాద్‌:  అమెరికా అధ్య‌క్షుడు డోనాల్డ్ ట్రంప్‌.. భార‌త ప‌ర్య‌ట‌న‌కు వ‌స్తున్న విష‌యం తెలిసిందే.  ఈనెల 24, 25 తేదీల్లో ఆయ‌న భార‌త్‌లో ప‌ర్య‌టిస్తారు. అయితే ఆ ప‌ర్య‌ట‌న‌కు ట్రంప్ కూతురు ఇవాంకా ట్రంప్ కూడా వ‌స్తున్న‌ట్లు అధికారులు వెల్ల‌డించారు. డోనాల్డ్ ట్రంప్‌కు అడ్వైజ‌ర్‌గా ప‌నిచేస్తున్న ఇవాంకాతో పాటు ఆమె భ‌ర్త జేర్డ్ కుష్న‌ర్ కూడా ఇండియా టూర్‌కు రానున్నారు.  ఢిల్లీతో పాటు అహ్మ‌దాబాద్‌లో డోనాల్డ్ ట్రంప్ ప‌ర్య‌టించ‌నున్నారు.  ట్రంప్ భార్య మెలానియా.. ఢిల్లీలోని ఓ పాఠ‌శాల‌కు వెళ్ల‌నున్నారు.  ఇక అహ్మాదాబాద్‌లో మొతేరా స్టేడియాన్ని ట్రంప్‌, మోదీలు ప్రారంభించ‌నున్నారు.  ఆగ్రాలోని తాజ్‌ను కూడా ట్రంప్ ఫ్యామిలీ సంద‌ర్శించ‌నున్న‌ది. 2017లో ఇవాంకా ట్రంప్‌.. హైద‌రాబాద్‌లోనూ ప‌ర్య‌టించింది. గ్లోబ‌ల్ ఎంట‌ర్‌ప్రీన‌ర్‌షిప్ స‌మ్మిట్‌లో పాల్గొనేందుకు ఆమె వ‌చ్చారు. అప్పుడు తెలంగాణ మంత్రి కేటీఆర్‌.. ఆమెతో చ‌ర్చాగోష్టి నిర్వ‌హించారు.


logo