మంగళవారం 26 మే 2020
National - May 23, 2020 , 09:51:07

జ్యోతికుమార్ స‌హ‌నం, ప్రేమ అద్భుతం : ఇవాంకా ట్రంప్‌

జ్యోతికుమార్ స‌హ‌నం, ప్రేమ అద్భుతం : ఇవాంకా ట్రంప్‌

హైద‌రాబాద్‌: జ్యోతి కుమార్ చూపిన స‌హ‌నం, ప్రేమ‌.. భార‌తీయ ప్ర‌జ‌ల గొప్ప‌త‌నానికి అద్దంప‌డుతుంది.  తండ్రిని సైకిల్‌పై కూర్చోబెట్టుకుని సుమారు 1200 కిలోమీట‌ర్ల దూరం సైకిల్ తొక్కింది జ్యోతి.  ఈ సంఘ‌ట‌న అమెరికా అధ్య‌క్షుడు స‌ల‌హాదారు ఇవాంకా ట్రంప్‌ను ఆక‌ట్టుకున్న‌ది.  లాక్‌డౌన్ వ‌ల్ల ఉపాధి కోల్పోయి.. స్వంత గ్రామానికి వెళ్లే క్ర‌మంలో జ్యోతి కుమార్ గాయ‌ప‌డ్డ త‌న తండ్రిని సైకిల్‌పై తీసుకెళ్లింది. జ్యోతి ప‌ట్టుద‌ల అంద‌ర్నీ ఆక‌ర్షించింది.  ఆమె ప‌ట్టుద‌ల‌కు అంద‌రూ స‌లామ్ కొడుతున్నారు.  ఇవాంకా ట్రంప్ కూడా త‌న మ‌న‌సులో మాట‌ను దాచుకోలేక‌పోయారు.  జ్యోతిని ఆమె విశేషంగా కొనియాడారు. జ్యోతి చూపిన అద్భుత‌మైన‌ ఓర్పు, ప్రేమ.. భార‌తీయ ప్ర‌జ‌ల‌ను, సైక్లింగ్ స‌మాఖ్య‌ను క‌ట్ట‌ప‌డేసింద‌ని ఇవాంకా త‌న ట్విట్ట‌ర్‌లో పేర్కొన్నారు.  
logo