గురువారం 02 ఏప్రిల్ 2020
National - Feb 26, 2020 , 09:15:47

షేర్వానీలో మెరిసిన ఇవాంకా!

షేర్వానీలో మెరిసిన ఇవాంకా!

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 25: భారత పర్యటనలో ఉన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ కుమార్తె ఇవాంకా తన వస్త్రధారణ విషయంలో ప్రథమ మహిళ మెలానియా ట్రంప్‌ను అనుసరించారు. భారతీయత ఉట్టిపడేలా తెలుపు రంగు షేర్వాణీ ధరించి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. మంగళవారం రాష్ట్రపతి భవన్‌లో జరిగిన కార్యక్రమానికి హాజరైన ఇవాంకా.. ప్రముఖ భారతీయ డిజైనర్‌ అనితా డోంగ్రే రూపొందించిన డ్రెస్‌ను ధరించారు. పశ్చిమబెంగాల్‌లోని ముర్షీదాబాద్‌ పట్టుతో ఈ షేర్వానీని రూపొందించారు. ఈ షేర్వానీ డిజైన్‌ కాలాతీతమైనదని, 20 ఏండ్ల కిందట ఈ ైస్టెల్‌ రూపొందినా, ఇప్పటికీ అంతే అద్భుతంగా అనిపిస్తున్నదని అనితా డోంగ్రే పేర్కొన్నారు. సోమవారం మెలానియా 20వ శతాబ్దపు భారతీయ వస్త్రధారణలో కనిపించిన సంగతి తెలిసిందే. తెల్లటి జంప్‌సూట్‌ వేసుకుని మధ్యలో నడుముకు ఆకుపచ్చటి కండువాను ధరించారు. దీన్ని ఫ్రెంచ్‌ అమెరికన్‌ డిజైనర్‌ హెర్వ్‌ పియరీ రూపొందించారు. 

logo
>>>>>>