గురువారం 29 అక్టోబర్ 2020
National - Sep 27, 2020 , 19:52:29

దేశ మనస్సాక్షిగా రాష్ట్రపతి వ్యవహరించలేదు: అకాలీదళ్ చీఫ్

దేశ మనస్సాక్షిగా రాష్ట్రపతి వ్యవహరించలేదు: అకాలీదళ్ చీఫ్

అమృత్‌సర్: భారత దేశానికి నిజమైన చీకటి రోజని శిరోమణి అకాలీదళ్ చీఫ్ సుఖ్‌బీర్ సింగ్ బాదల్ అన్నారు. దేశ మనస్సాక్షి ప్రకారం రాష్ట్రపతి వ్యవహరించక వ్యవసాయ బిల్లులకు ఆమోదం తెలిపారని విమర్శించారు. శిరోమణి అకాలీదళ్‌తో పాటు మిగతా ప్రతిపక్ష పార్టీలు,  రైతులు కోరుతున్నట్లుగా వ్యవసాయ బిల్లులను పార్లమెంట్‌కు రాష్ట్రపతి తిప్పిపంపుతారని ఆశించామని అన్నారు. అయితే రైతులు, ప్రతిపక్ష పార్టీల నమ్మకాన్ని ఆయన వమ్ము చేశారని విమర్శించారు. రైతుల తరుఫున పోరాటం కోసం ప్రతిపక్షాలంతా ఒక్కతాటిపైకి రావాలని ఆదివారం ఆయన పిలుపునిచ్చారు. దేశంలోని రైతుల కోసం ఎలాంటి త్యాగాలకైనా తాము సిద్ధమేనని సుఖ్‌బీర్ సింగ్ బాదల్ స్పష్టం చేశారు. కేంద్రం నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ప్రభుత్వంలో భాగమైన శిరోమణి అకాలీదళ్ ఎన్డీయే నుంచి వైదొలగుతున్నట్లు శనివారం ప్రకటించింది. ఆ పార్టీకి చెందిన హర్‌సిమ్రత్ కౌర్ బాదల్ కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే.


లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.