ఆదివారం 29 మార్చి 2020
National - Mar 27, 2020 , 07:46:08

'ఈ కష్ట సమయంలో వాటిని చూసుకోవడం మన బాధ్యత'

'ఈ కష్ట సమయంలో వాటిని చూసుకోవడం మన బాధ్యత'

ముంబయి : ఆకలి ఏ జీవికైనా బాధనే కలిగిస్తుంది. కరోనా వైరస్‌ లాక్‌డౌన్‌ నేపథ్యంలో కష్టజీవులకు, రోజువారి కూలీలకు దినం గడవడమే కష్టంగా ఉంటుంది. ఈ నేపథ్యంలో దేశంలో ఏ ఒక్క వ్యక్తి ఆకలితో ఉండకూడదని కేంద్ర నిన్న ఆర్థిక ప్యాకేజీని ప్రకటించిన విషయం తెలిసిందే. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సైతం ఉదయం, రాత్రి వేళల్లో అన్నపూర్ణ క్యాంటీన్లను తెరిచి ఉంచి ఉచితంగానే భోజన సదుపాయం కల్పించడం, ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా బీపీఎల్‌ కుటుంబాలకు వ్యక్తి 12 కిలోల బియ్యం చొప్పున అదేవిధంగా ఒక్కో బీపీఎల్‌ కుటుంబానికి రూ.1500 చొప్పున అందజేసేందుకు పూనుకుంది.


ప్రజల బాధలను ప్రభుత్వాలు పట్టించుంటున్నాయి సరే మరి లాక్‌డౌన్‌ నేపథ్యంలో మూగ జీవాల ఆకలి పరిస్థితి ఏంటని మహారాష్ట్రలోని నాగపూర్‌కు చెందిన అక్కాచెల్లెళ్లు ఆలోచించారు. కాజల్‌, దిశా అనే ఇద్దరూ అక్కాచెల్లెళ్లు ఇంట్లో ఆహారాన్ని బాక్సుల్లో పెట్టుకొని వచ్చి వీధి కుక్కల ఆకలిని తీర్చారు. దీనిపై వారు స్పందిస్తూ... అన్ని రకాల ఆహార పదార్థాల దుకాణాలు మూసిఉంటున్నాయి. ఈ సమయంలో వాటిని ఆహారం దొరకడం చాలా కష్టం ఉంటుంది. ఈ కష్టసమయంలో వాటి ఆకలి తీర్చడం మన బాధ్యత అన్నారు.logo