బుధవారం 02 డిసెంబర్ 2020
National - Oct 23, 2020 , 16:32:02

చైనా 1,000 చ‌.కి.మీ. భార‌త భూభాగాన్ని ఆక్ర‌మించింది: మెహ‌బూబా ముఫ్తీ

చైనా 1,000 చ‌.కి.మీ. భార‌త భూభాగాన్ని ఆక్ర‌మించింది: మెహ‌బూబా ముఫ్తీ

శ్రీన‌గ‌ర్‌: జ‌మ్ముక‌శ్మీర్ మాజీ ముఖ్య‌మంత్రి, పీడీపీ అధ్య‌క్షురాలు మెహ‌బూబా ముఫ్తీ కేంద్ర ప్ర‌భుత్వంపై విమ‌ర్శ‌లు గుప్పించారు. చైనా స‌రిహ‌ద్దుల్లో భార‌త భూభాగాన్ని కాపాడుకోవ‌డంలో ప్ర‌భుత్వం విఫ‌ల‌మైంద‌ని ఆమె మండిప‌డ్డారు. భార‌త్‌కు చెందిన 1,000 చ‌ద‌ర‌పు కిలోమీట‌ర్ల భూభాగాన్ని చైనా ఆక్ర‌మించింద‌ని, ఇది నిజ‌మ‌ని ముఫ్తీ వ్యాఖ్యానించారు. ఎంత‌లేద‌న్నా మ‌నం చైనా స‌రిహ‌ద్దుల నుంచి 40 కిలోమీట‌ర్లు వెన‌క్కి వ‌చ్చామ‌ని ఆమె పేర్కొన్నారు. 

అంతేగాక జ‌మ్ముక‌శ్మీర్‌లో ఆర్టిక‌ల్ 370 ర‌ద్దుపై కూడా చైనా స్పందించింద‌ని మెహ‌బూబా ముఫ్తీ చెప్పారు. వివాదంలో ఉన్న‌ప్ప‌టికీ జ‌మ్ముక‌శ్మీర్‌ను ఎందుకు కేంద్ర‌పాలిత ప్రాంతంగా చేశార‌ని భార‌త్‌ను చైనా ప్ర‌శ్నించిన‌ట్లు ముఫ్తీ తెలిపారు. ఆర్టిక‌ల్ 370 ర‌ద్దు కార‌ణంగా జ‌మ్ముక‌శ్మీర్‌ గ‌తంలో ఎన్న‌డూ లేనంత‌గా అంత‌ర్జాతీయస్థాయిలో చ‌ర్చనీయాంశ‌మైంద‌ని  ఆమె చెప్పారు.  ‌  

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.