బుధవారం 23 సెప్టెంబర్ 2020
National - Aug 15, 2020 , 08:50:33

16 వేల ఫీట్ల ఎత్తులో ఘ‌నంగా స్వాతంత్య్రదినోత్స‌వ వేడుక‌లు‌

16 వేల ఫీట్ల ఎత్తులో ఘ‌నంగా స్వాతంత్య్రదినోత్స‌వ వేడుక‌లు‌

ల‌ఢ‌క్‌: స‌ముద్ర మ‌ట్టానికి 16 వేల ఫీట్ల‌ ఎత్తులో ఐటీబీపీ సైనికులు స్వాతంత్య్ర దినోత్స‌వ వేడుక‌లను ఘ‌నంగా నిర్వ‌హించారు. ల‌ఢ‌క్‌లోని భార‌త్-చైనా స‌రిహ‌ద్దుల్లో ఉన్న పాంగాంగ్ స‌ర‌స్సు వ‌ద్ద ఇండో టిబెట‌న్ స‌రిహ‌ద్దు ర‌క్ష‌క ద‌ళం (ఐటీబీపీ) జాతీయ జెండాను ఎగుర‌వేసింది. త్రివ‌ర్ణ ప‌తాకాన్ని చేత‌బూనిన సైనికులు స‌రిహ‌ద్దు వెంట మార్చ్ ఫాస్ట్ నిర్వ‌హించారు. జాతీయ గీతాలాప‌న చేశారు. ఈమేర‌కు ఐటీబీపీ ట్వీట్‌చేసింది. 


గ‌త నెల‌లో చైనా బ‌ల‌గాల‌తో ముఖాముఖి పోరాడిన 21 మంది సైనికుల పేర్ల‌ను గ్యాలంట‌రీ మెడ‌ల్స్ కోసం ఐటీబీపీ సిఫార‌సు చేసింది. గ‌ల్వాన్ లోయ‌లో ఇలాంటి పోరాటం ఎప్పుడూ జ‌ర‌గ‌లేద‌ని, ఈశాన్య ల‌ఢ‌క్‌లోని ప్రాంతాల్లో ఇలాంటి ఘ‌ట‌న‌లు జ‌రిగాయ‌ని సీనియ‌ర్ అధికారులు తెలిపారు.   ‌‌logo