శుక్రవారం 07 ఆగస్టు 2020
National - Jul 13, 2020 , 10:07:01

స‌రిహ‌ద్దులో ర‌క్ష‌ణ‌తో పాటు ప‌ర్యావ‌ర‌ణ ప‌రిర‌క్ష‌ణ‌లో ఐటీబీపీ

స‌రిహ‌ద్దులో ర‌క్ష‌ణ‌తో పాటు ప‌ర్యావ‌ర‌ణ ప‌రిర‌క్ష‌ణ‌లో ఐటీబీపీ

సిమ్లా : స‌రిహ‌ద్దులో ర‌క్ష‌ణ‌తో పాటు ప‌ర్యావ‌ర‌ణ ప‌రిర‌క్ష‌ణ‌పై భాగ‌స్వాముల‌వుతున్నారు ఇండో- టిబెట‌న్ బోర్డ‌ర్ పోలీస్ బ‌ల‌గాలు. సిమ్లాలో రాష్ట్రవ్యాప్తంగా సుమారు ఏడువేల మొక్క‌లు నాటార‌ని హిమాచల్ ప్రదేశ్ అటవీ శాఖ మంత్రి గోవింద్ సింగ్ ఠాకూర్, ఐటీబీపీ క్యాంప్ కమాండెంట్ దీపక్ కుమార్ పాండే తెలిపారు. కేంద్రం నిర్ణ‌యం మేర‌కు పారామిలటరీ బలగాలు మొక్కలు  మొక్క‌లు నాటార‌ని, దేశంలోని అన్ని పారామిల‌ట‌రీ బ‌ల‌గాలు కూడా ప‌ర్యావ‌ర‌ణాన్ని మెరుగు ప‌రిచేందుకు దోహ‌దం చేయాల‌ని కేంద్రం ఆదేశించింద‌ని మంత్రి తెలిపారు.

స‌రిహ‌ద్దులో సేవ‌లందించ‌డంతో పాటు ప‌ర్యావ‌ర‌ణ ప‌రిర‌క్ష‌ణ‌కు మొక్క‌లు నాటుతున్న ఐటీబీపీకి ధ‌న్య‌వాదాలు తెలుపుతున్న‌ట్లు పేర్కొన్నారు. ఐటీబీపీ రెండు హెక్టార్ల భూమిని ద‌త్త‌త తీసుకుంద‌ని, ఇక్క‌డ ప‌చ్చ‌ద‌నం విక‌సిస్తుంద‌ని నేను ఖ‌చ్చితంగా న‌మ్ముతున్నాను అని పేర్కొన్నారు. 'పర్యావరణాన్ని సంరక్షించడం కూడా మీ దేశానికి సేవ చేయడంలో ఒక భాగ‌మ‌ని, ఇప్ప‌టికి 7వేల మొక్క‌లు నాటామ‌ని, రాబోయే రోజుల్లో మరిన్ని మొక్కలు నాటిస్తాం' అని సిమ్లా ఐటీబీపీ క్యాంప్ కమాండెంట్ దీపక్ కుమార్ పాండే చెప్పారు.

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.


logo