సోమవారం 25 మే 2020
National - Mar 31, 2020 , 18:38:34

పీఎం కేర్స్‌కు ఐటీబీపీ రూ. 10.53 కోట్ల విరాళం

పీఎం కేర్స్‌కు ఐటీబీపీ రూ. 10.53 కోట్ల విరాళం

ఢిల్లీ : కరోనా వైరస్‌పై పోరాటంలో ఇండో టిబెటిన్‌ బోర్డర్‌ పోలీస్‌(ఐటీబీపీ) తమ వంతు సహాయాన్ని ప్రకటించింది. పీఎం కేర్స్‌కు తమ ఒక్క రోజు వేతనాన్ని రూ. 10 కోట్ల 53 లక్షల 58 వేల 479 రూపాయలను చెక్కు రూపంలో అందజేసింది. పీఎం కేర్స్‌కు ఎలక్ట్రానిక్‌ రూపంలో ఈ నగదు బదిలీ చేయబడుతుంది. ఈ నగదు మొత్తం ఐటీబీపీ కి చెందిన సిబ్బంది ఒక్క రోజు వేతనంగా ఐటీబీపీ అధికార ప్రతినిధి వివేక్‌ కుమార్‌ పాండే తెలిపారు. 90 వేల మంది ఐటీబీపీ సిబ్బంది చైనాతో సరిహద్దుగా ఉన్న 3,488 కిలోమీటర్ల లైన్‌ ఆఫ్‌ యాక్చువల్‌ కంట్రోల్‌ను పహారా కాస్తుంది. అదేవిధంగా అంతర్గత భద్రతలో సైతం విధులు నిర్వర్తిస్తుంది. ఐటీబీపీ ఢిల్లీలో వెయ్యి పడకల క్వారంటైన్‌ కేంద్రాన్ని నిర్వహిస్తుంది. కరోనాపై పోరాటానికి పీఎం సిటిజన్స్‌ అసిస్టెన్స్‌ అండ్‌ రిలీఫ్‌ ఎమర్జెన్సీ సిట్యూయేషన్‌(పీఎం-కేర్స్‌)ను ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఇటీవలే ప్రకటించిన విషయం తెలిసిందే. 


logo