సోమవారం 30 నవంబర్ 2020
National - Oct 30, 2020 , 11:11:41

పేలిన ఐఈడీ.. ఐటీబీపీ జ‌వాన్‌కు గాయాలు

పేలిన ఐఈడీ.. ఐటీబీపీ జ‌వాన్‌కు గాయాలు

రాయ్‌పూర్ : ఛ‌త్తీస్‌గ‌ఢ్‌లోని నారాయ‌ణ‌పూర్ జిల్లాలో మావోయిస్టులు దుశ్చ‌ర్య‌కు పాల్ప‌డ్డారు. కోకామేట - క‌చ్చ‌ప‌ల్ రోడ్డులో 53వ బెటాలియ‌న్‌కు చెందిన ఐటీబీపీ జ‌వాన్లు కూంబింగ్ నిర్వ‌హిస్తున్నారు. ఈ స‌మ‌యంలో మావోయిస్టులు ఐఈడీ బాంబు పేల్చారు. ఈ పేలుడు ధాటికి ఓ జ‌వాను తీవ్రంగా గాయ‌ప‌డ్డారు. దీంతో గాయ‌ప‌డ్డ జ‌వాన్‌ను చికిత్స నిమిత్తం ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. ఆ ఏరియాలో జ‌వాన్లు కూంబింగ్ కొన‌సాగిస్తున్నారు.