శనివారం 11 జూలై 2020
National - Jun 24, 2020 , 02:48:42

చైనా సరిహద్దులకు ఐటీబీపీ బలగాలు

చైనా సరిహద్దులకు ఐటీబీపీ బలగాలు

  • 4000 మంది సిబ్బంది మోహరింపు

న్యూఢిల్లీ, జూన్‌ 23: భారత్‌, చైనా మధ్య సరిహద్దు ప్రతిష్ఠంభన, హింసాత్మక ఘర్షణల నేపథ్యంలో వాస్తవాధీన రేఖ(ఎల్‌ఏసీ) వెంబడి సరిహద్దుల్లోని వివిధ ప్రాంతాలకు ఇండో టిబెటన్‌ బోర్డర్‌ పోలీస్‌ (ఐటీబీపీ) కొత్తగా 40 కంపెనీల బలగాలను (4000 మంది) మోహరిస్తున్నది. అలాగే ఎస్‌యూవీలు, అన్ని వాతావరణ పరిస్థితులకు సరిపోయే వాహనాలు, స్నో స్కూటర్లు, ట్రక్కులను సైతం సరిహద్దులకు పంపుతున్నది. దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో అంతర్గత భద్రతా విధుల్లో ఉన్న ఈ బలగాలను ఉపసంహరించి.. లఢక్‌, అరుణాచల్‌ప్రదేశ్‌తోపాటు వివిధ సరిహద్దు ప్రాంతాల్లో మోహరిస్తున్నట్లు అధికారులు తెలిపారు. కరోనా నేపథ్యంలో దేశ ప్రధాన భూభాగం నుంచి సరిహద్దులకు వెళ్తున్నందున వీరిని రెండు వారాలపాటు క్వారంటైన్‌లో ఉంచనున్నారు. అక్కడి వాతావరణ పరిస్థితులకు అలవాటు పడేందుకు ఈ సమయం వారికి ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. ఈ 40 కంపెనీలకు తోడుగా త్వరలోనే మరో 20 కంపెనీల బలగాలను సరిహద్దుల్లో మోహరించనున్నట్లు సమాచారం. 


logo