న్యూఢిల్లీ: ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్ (ఐటీబీపీ)కు సేవలందిస్తున్న ఒక శునకం, ఒక గుర్రానికి ప్రత్యేక మెడల్స్ అందజేశారు. గ్రేటర్ నోయిడాలో ఐటీబీపీ 39వ బెటాలిన్ వార్షిక డీజీ పరేడ్ శుక్రవారం జరిగింది. ఐటీబీపీ డీజీ సంజయ్ అరోరా ఇందులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఐటీబీపీకి ఉత్తమంగా సేవలందించిన మాలినోయిస్ జాతి శునకం కే9(ఐకేఎస్) ‘స్నోవీ’, గుర్రం ‘ఛాంపియన్’కు ప్రత్యేక పతకాలను ఆయన ప్రదానం చేశారు. 2016 నుంచి బెస్ట్ డాగ్, బెస్ట్ గుర్రానికి అవార్డులను ఐటీబీపీ అందజేస్తున్నది.