మంగళవారం 19 జనవరి 2021
National - Dec 26, 2020 , 22:07:20

రైతు నేతకు బీహార్‌ నుంచి బెదిరింపు ఫోన్‌కాల్‌

రైతు నేతకు బీహార్‌ నుంచి బెదిరింపు ఫోన్‌కాల్‌

న్యూఢిల్లీ: భారతీయ కిసాన్‌ సంఘం (బీకేయూ) రైతు నేత రాకేశ్ తికైట్‌కు బీహార్‌ నుంచి బెదిరింపు ఫోన్‌ కాల్‌ వచ్చింది. వ్యవసాయ చట్టాలను కేంద్ర ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని డిమాండ్‌ చేస్తూ 40 రైతు సంఘాలకు చెందిన రైతులు ఢిల్లీ సరిహద్దులోని సింఘు వద్ద గత నెల రోజులుగా నిరసన చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కొందరు రైతు నేతలకు బెదిరింపులు వస్తున్నాయి. తాజాగా బీకేయూ అధికార ప్రతినిధి రాకేశ్ తికైట్‌కు శనివారం ఇలాంటి ఫోన్‌కాల్‌ వచ్చింది. ఈ విషయాన్ని స్వయంగా ఆయనే మీడియాకు వెల్లడించారు. ‘బీహార్ నుంచి ఫోన్ కాల్ వచ్చింది. నన్ను ఆయుధాలతో చంపేస్తామని వారు బెదిరించారు. కాల్‌ రికార్డింగ్‌ను పోలీసు అధికారికి  ఫార్వార్డ్ చేసాను. తదుపరి చేయవలసినది వారు చేస్తారు’ అని రాకేశ్ తిటికైట్ తెలిపారు. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలం­గాణ ఆండ్రా­యిడ్ యాప్ డౌన్‌­లోడ్ చేసు­కోండి