శుక్రవారం 14 ఆగస్టు 2020
National - Jul 24, 2020 , 08:59:23

మ‌రికొన్ని యాప్‌ల‌పై నిషేధం విధించ‌నున్న ఐటీ శాఖ‌!

మ‌రికొన్ని యాప్‌ల‌పై నిషేధం విధించ‌నున్న ఐటీ శాఖ‌!

న్యూఢిల్లీ: మ‌రికొన్ని మొబైల్ యాప్‌ల‌పై నిషేధించ‌డానికి కేంద్ర ఐటీ శాఖ స‌న్న‌ద్ధ‌మ‌వుతున్న‌ది. ముఖ్యంగా చైనాతో సంబంధ‌మున్న మొబైల్ అప్లికేష‌న్ల‌పై నిషేధం విధించ‌నున్న‌ద‌ని స‌మాచారం. ఇందులో హ‌లా లైట్‌, షేరిట్ లైట్‌, బిగో లైట్, వీఎఫ్‌వై లైట్ వంటి యాప్‌ల‌ను గూగుల్ ప్లేస్టోర్, యాపిల్ యాప్ స్టోర్‌ నుంచి తొల‌గించ‌నున్న‌ద‌ని అధికారులు పేర్కొంటున్నారు.  

గ‌త నెల‌లో గ‌ల్వాన్ లోయ‌లో భార‌త్‌, చైనా సైనికుల మ‌ధ్య ఘ‌ర్ష‌ణ చోటుచేసుకోవ‌డంతో, 20 మంది భార‌తీయ సైనికులు మ‌ర‌ణించిన విష‌యం తెలిసిందే. ఈ నేప‌థ్యంలో దేశ సమగ్రత, సార్వభౌమాధికారం, రక్షణ, ప్రజా భద్రత దృష్ట్యా టిక్‌టాక్, హలో, షేర్ ఇట్, యూసీ బ్రౌజర్ వంటి 59 యాప్‌ల‌పై కేంద్ర‌ప్ర‌భుత్వం నిషేధం విధించింది.


logo