గురువారం 06 ఆగస్టు 2020
National - Jul 23, 2020 , 13:07:49

విశ్వ‌స‌నీయ‌మైన ఏఐ సిస్ట‌మ్స్ కావాలి: కేంద్ర ఐటీశాఖ మంత్రి

విశ్వ‌స‌నీయ‌మైన ఏఐ సిస్ట‌మ్స్  కావాలి:  కేంద్ర ఐటీశాఖ మంత్రి

హైద‌రాబాద్‌:  డేటా ర‌క్ష‌ణ కోసం ప‌టిష్ట‌మైన చ‌ట్టాన్ని అమ‌లు చేయ‌నున్న‌ట్లు కేంద్ర ఐటీశాఖ మంత్రి ర‌విశంక‌ర్ ప్ర‌సాద్ తెలిపారు.  ఆ చ‌ట్టంతో పైరుల డేటా ప్రైవ‌సీ స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించ‌డమే కాదు, ఆవిష్క‌ర‌ణ‌లు, ఆర్థిక అభివృద్ధికి ప‌నికి వ‌చ్చే విధంగా డేటాను అందుబాటులో ఉంచ‌నున్న‌ట్లు మంత్రి తెలిపారు.  సౌదీ అరేబియా నిర్వ‌హించిన‌ జీ-20 డిజిటల్ ఎకాన‌మీ వ‌ర్చువ‌ల్ స‌ద‌స్సులో ఆయ‌న మాట్లాడారు. అన్ని దేశాల్లోనూ డిజిట‌ల్ ఫ్లాట్‌ఫాంల వినియోగం పెరిగింద‌ని,  న‌మ్మ‌క‌మైన‌..సుర‌క్షిత‌మైన‌..భ‌ద్ర‌మైన వ్య‌వ‌స్థ‌ను రూపొందించాల‌ని ఆయ‌న అన్నారు.  డిజిట‌ల్ ఫ్లాట్‌ఫాముల‌న్నీ బాధ్య‌తాయుతంగా వ్య‌వ‌హ‌రించాల్సిన‌ త‌రుణం ఆస‌న్న‌మైంద‌న్నారు.  దేశ ర‌క్ష‌ణ‌, పౌరుల భ‌ద్ర‌త‌, ప్రైవ‌సీ విష‌యంలో త‌ప్ప‌ద‌న్నారు. స‌మాజాన్ని మార్చ‌గ‌ల న‌మ్మ‌క‌మైన ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజెన్స్ సిస్ట‌మ్స్‌ను నిర్మించాల‌ని ఆయ‌న అభిప్రాయ‌ప‌డ్డారు. కోవిడ్ నేప‌థ్యంలో గ్లోబ‌ల్ స‌ప్ల‌య్ చైన్‌ను బ‌లంగా త‌యారు చేయాల‌న్నారు.  logo