బుధవారం 23 సెప్టెంబర్ 2020
National - Aug 13, 2020 , 07:53:25

బ్యాటరీలు అమర్చని విద్యుత్‌ వాహనాల విక్రయం, రిజిస్ట్రేషన్‌కు ఓకే

బ్యాటరీలు అమర్చని విద్యుత్‌ వాహనాల విక్రయం, రిజిస్ట్రేషన్‌కు ఓకే

న్యూఢిల్లీ: ముందస్తు బ్యాటరీలను అమర్చని విద్యుత్‌ వాహనాల విక్రయంతోపాటు వాటి రిజిస్ట్రేషన్‌ను అనుమతినిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం బుధవారం తెలిపింది. విద్యుత్‌ వాహనం ధరలో సుమారు 30-40 శాతం బ్యాటరీ ధర ఉంటుంది. విద్యుత్‌ వాహనాల కొనుగోలుదారులపై ధర భారం తగ్గించేందుకే కేంద్రం ఈ నిర్ణయం తీసుకున్నది. సదరు బ్యాటరీలను సంబంధిత వాహనాల తయారీ సంస్థలు విడిగా కొనుగోలుదారులకు అందుబాటులోకి తీసుకొస్తాయి. టెస్టింగ్‌ ఏజెన్సీ సర్టిఫికెట్‌ ప్రకారం బ్యాటరీలను ముందస్తుగా అమర్చకున్నా, విద్యుత్‌ వాహనాలను విక్రయించేందుకు, రిజిస్ట్రేషన్‌ చేసేందుకు అనుమతించాలని కోరుతూ రాష్ర్టాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు కేంద్ర రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వశాఖ లేఖ రాసింది. రిజిస్ట్రేషన్‌ కోసం బ్యాటరీ వివరాలను నమోదు చేయాల్సిన అవసరం లేదని పేర్కొంది. logo