ఆదివారం 28 ఫిబ్రవరి 2021
National - Jan 23, 2021 , 12:20:02

ప్ర‌తిదానికి వ్య‌తిరేకత‌ ప‌ద్ధ‌తి కాదు: ‌బెంగాల్ గ‌వ‌ర్న‌ర్

ప్ర‌తిదానికి వ్య‌తిరేకత‌ ప‌ద్ధ‌తి కాదు: ‌బెంగాల్ గ‌వ‌ర్న‌ర్

కోల్‌క‌తా: నేతాజీ సుభాష్ చంద్ర‌బోస్ త‌న ప‌రాక్ర‌మంతో స్వాతంత్ర్య‌పోరాట స‌మ‌యంలో దేశాన్ని ఒక్క‌తాటిపై న‌డిపించార‌ని ప‌శ్చిమ‌బెంగాల్ గ‌వ‌ర్న‌ర్‌ జ‌గ‌దీప్ ధన్‌క‌ర్‌ పేర్కొన్నారు. నేతాజీ ప‌రాక్ర‌మానికి గుర్తుగానే ఆయ‌న జ‌న్మ‌దిన‌మైన జ‌న‌వరి 23న ప‌రాక్ర‌మ్ దివ‌స్ జ‌రుపుకుంటున్నామ‌ని చెప్పారు. నేతాజీ 125వ‌ జ‌న్మ‌దినోత్స‌వం సంద‌ర్భంగా జ‌గ‌దీప్ ధన్‌క‌ర్ మాట్లాడారు. ఈ సంద‌ర్భంగా ప‌శ్చిమ‌బెంగాల్ అసెంబ్లీ ఎన్నిక‌లు, మ‌మ‌తా బెన‌ర్జి ప్ర‌భుత్వ వైఖ‌రి గురించి ధ‌న‌కర్ త‌న అభిప్రాయాలు వెల్ల‌డించారు. 

స‌హ‌కార స‌మాఖ్య విధానానికి విరుద్ధంగా న‌డుచుకోవ‌డం, ప్ర‌తి అంశంపై వ్య‌తిరేక‌త వ్య‌క్తంచేయ‌డం క‌రెక్టు కాద‌ని ధ‌న్‌‌క‌ర్ వ్యాఖ్యానించారు. కేంద్ర ప్ర‌భుత్వ నిర్ణ‌యాల విష‌యంలో మ‌మ‌తాబెన‌ర్జి ప్ర‌భుత్వ వైఖ‌రిని ఉద్దేశించి ప‌రోక్షంగా ఆయ‌న ఈ వ్యాఖ్య‌లు చేశారు. అదేవిధంగా రాబోయే అసెంబ్లీ ఎన్నిక‌లు నిష్పాక్షికంగా, అహింసాయుతంగా జరుగుతాయ‌ని ధ‌న్‌క‌ర్ రాష్ట్ర ప్ర‌జ‌ల‌కు హామీ ఇచ్చారు.

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.

VIDEOS

logo