శనివారం 04 ఏప్రిల్ 2020
National - Mar 10, 2020 , 18:09:42

సింధియా రావడం ‘ఘర్‌ వాపసీ’ లాంటిది..

సింధియా రావడం ‘ఘర్‌ వాపసీ’ లాంటిది..

న్యూఢిల్లీ: జ్యోతిరాదిత్య సింధియా కాంగ్రెస్‌ పార్టీకి రాజీనామా చేసి..బీజేపీలో చేరనున్న విషయం తెలిసిందే. సింధియా బీజేపీలో పార్టీలో చేరడాన్ని ఆ పార్టీ ఎమ్మెల్యే యశోధరా రాజే (సింధియా అత్తమ్మ)స్వాగతించారు. ఆమె ఇవాళ మీడియాతో మాట్లాడుతూ..జాతీయ అవసరాల దృష్ట్యా జ్యోతిరాదిత్య సింధియా పార్టీలోకి రావడం ఘర్‌ వాపసీ (ఇంటికి తిరిగిరావడం)తో పోల్చారు. జన్‌ సంగ్‌, బీజేపీలో తన తల్లి రాజ్‌మాత విజయె రాజే సింధియా కీలక పాత్ర పోషించారని ఈ సందర్భంగా యశోధరా రాజే గుర్తు చేసుకున్నారు. జ్యోతిరాదిత్య సింధియా,  9 సార్లు కాంగ్రెస్‌ ఎమ్మెల్యేగా సేవలందించిన ఆయన తండ్రి దివంగత మాధవ్‌ సింధియా అంటే బీజేపీకి ఎంతో గౌరవం ఉందని అన్నారు.  జ్యోతిరాధిత్య సింధియాకు పార్టీలోకి స్వాగతం పలుకుతూ..ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్‌షా రాజ్‌మాతపై ఉన్న గౌరవాన్ని చాటుకున్నారని యశోధరా రాజే అన్నారు. 


logo