సర్కార్‌ను విమర్శిస్తే నేరమే!

- బీహార్‌లో సర్క్యులర్ జారీ
- వ్యతిరేకిస్తున్న ప్రతిపక్షాలు
- హిట్లర్‌లా నితీశ్: తేజస్వి యాదవ్
పాట్నా, జనవరి 22: ‘రాష్ట్ర ప్రభుత్వానికి, మంత్రులకు, ఎంపీలకు, ఎమ్మెల్యేలకు, ప్రభుత్వ అధికారులకు వ్యతిరేకంగా ఎవరైనా సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెడితే అటువంటి చర్యలు సైబర్ నేరం కిందకు వస్తాయి. పోస్టులు చేసినవారు భారత శిక్షాస్మృతి కింద శిక్షార్హులు అవుతారు’.. బీహార్ సైబర్ నేరాల విభాగం హెడ్ నయ్యర్ హస్నన్ ఖాన్ గురువారం జారీ చేసిన సర్క్యులర్ సారాంశం ఇది. ఈ వివాదాస్పద సర్క్యులర్‌పై రాష్ట్రవ్యాప్తంగా వ్యతిరేకత వ్యక్తమవుతున్నది. సీఎం నితీశ్ కుమార్ హిట్లర్‌లా వ్యవహరిస్తున్నారని ప్రతిపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ ఈ సర్క్యులర్ స్క్రీన్‌షాట్‌ను ట్వీట్ చేశారు. ‘హిట్లర్ అడుగుజాడల్లో నడుస్తున్న సీఎం నితీశ్ కుమార్ జారీ చేసిన సర్క్యులర్ చూడండి’ అంటూ ఆగ్రహం వ్యక్తంచేశారు. ‘ప్రజావ్యతిరేక విధానాలపై నిరసనలు తెలపడానికి ప్రదేశాలు ఉండవు. సామాజిక మాధ్యమాల్లో ప్రభుత్వాన్ని విమర్శిస్తే జైలుకు పంపుతారా’ అని మండిపడ్డారు. అయితే ఈ సర్క్యులర్‌ను అధికార ఎన్డీఏ సమర్థించుకొన్నది. సామాజిక మాధ్యమాల్లో విషప్రచారానికి అడ్డుకట్ట వేయడానికి ఇలాంటి చర్యలు తప్పనిసరని పేర్కొన్నది. ‘ఇది స్వాగతించాల్సిన విషయం’ అని జేడీయూ అధికారప్రతినిధి రాజీవ్ రంజన్ ప్రసాద్ అన్నారు.
తాజావార్తలు
- అంతర్గాలం
- మళ్లీ గ్రే లిస్ట్‌లోనే పాక్
- నేడు దేశవ్యాప్త బంద్
- శభాష్ నర్సింలు..
- ఒక్క రోజు నెట్ బిల్లు రూ. 4.6 లక్షలు
- జాగ్రత్తతో సైబర్‌నేరాలకు చెక్: సీపీ సజ్జనార్
- ప్రభుత్వం పారిశ్రామికరంగానికి ప్రోత్సాహం
- అమ్మాయి మా బంధువే.. రూ.90 కోట్ల కట్నమిప్పిస్తాం..
- వేసవి తట్టుకునేలా.. మరో సబ్‌స్టేషన్
- ఎంఎస్ఎంఈ ద్వారా ఆన్లైన్లో టాయ్ ఫేయిర్