ఐఎస్‌ఎస్‌ఎఫ్‌ వరల్డ్‌ కప్‌ : మరో ఇద్దరు షూటర్లకు కరోనా

168
ఐఎస్‌ఎస్‌ఎఫ్‌ వరల్డ్‌ కప్‌ : మరో ఇద్దరు షూటర్లకు కరోనా

న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలో జరుగుతున్న ఇంటర్నేషనల్‌ స్పోర్ట్స్‌ షూటింగ్‌ ఫెడరేషన్‌ (ఐఎస్‌ఎస్‌ఎఫ్‌) ప్రపంచ కప్‌లో కరోనా మహమ్మారి బారినపడుతున్న కీడ్రాకారుల సంఖ్య పెరుగుతున్నది. ఇప్పటికే నలుగురు వైరస్‌కు పాజిటివ్‌గా పరీక్షించగా.. తాజాగా మరో ఇద్దరు వైరస్‌కు పాజిటివ్‌గా పరీక్షించారు. దీంతో టోర్నీలో వైరస్‌ బారినపడ్డ వారి సంఖ్య ఆరుకు చేరింది. కొవిడ్‌ మార్గదర్శకాల మేరకు వారిని ఐసోలేషన్‌కు తరలించినట్లు నేషనల్‌ రైఫిల్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌ఆర్‌ఏఐ) ఆదివారం తెలిపింది. శనివారం ఉదయం ఇద్దరు భారత షూటర్లు సహా ముగ్గురు వైరస్‌కు పాజిటివ్‌గా పరీక్షించారు. దీంతో వారికి టీమ్‌ ఉన్న హోటల్ గదిలోనే సెల్ఫ్‌ ఐసోలేషన్‌లో ఉంచారు.

వారితో గదుల్లో ఉన్న మరో ముగ్గురికి పరీక్షలు చేయించి, ముందస్తుగా ఐసోలేషన్‌కు తరలించారు. వారి రిపోర్టులు ఆలస్యంగా రాగా.. ఇందులో ఇద్దరు పాజిటివ్‌గా పరీక్షించారని పేర్కొన్నారు. ఇంటర్నేషనల్‌ షూటింగ్‌ స్పోర్ట్స్‌ ఫెడరేషన్‌ (ఐఎస్‌ఎస్‌ఎఫ్‌) నిబంధల ప్రకారమే అన్ని జరుగుతున్నాయని.. ఈ మేరకు టెక్నికల్‌‌ డైరెక్టర్‌తో సంప్రదింపులు జరుపుతున్నామని ఎన్ఆర్ఏఐ వర్గాలు తెలిపాయి. కొరియా, సింగపూర్, అమెరికా, యూకే, ఇరాన్, ఉక్రెయిన్, ఫ్రాన్స్, హంగేరీ, ఇటలీ, థాయ్ లాండ్, టర్కీ సహా 53 దేశాల నుంచి మొత్తం 294 మంది షూటర్లు ఈ టోర్నీలో పాల్గొంటున్నారు.