శుక్రవారం 27 నవంబర్ 2020
National - Nov 07, 2020 , 15:26:24

నింగికెగిరిన పీఎస్ఎల్వీ సీ49..

నింగికెగిరిన పీఎస్ఎల్వీ సీ49..

హైద‌రాబాద్‌: భార‌త అంత‌రిక్ష సంస్థ(ఇస్రో) ఈ ఏడాది తొలి ప్ర‌యోగం నిర్వ‌హించింది.  ఏపీలోని శ్రీహ‌రికోట నుంచి ఇవాళ మ‌ధ్యాహ్నం 3.10 నిమిషాల‌కు పీఎస్ఎల్వీ సీ49 రాకెట్ నింగికి ఎగిరింది. ఈ రాకెట్‌తో ఈఓఎస్‌-1 శాటిలైట్‌తో పాటు మ‌రో 9 క‌స్ట‌మ‌ర్ శాటిలైట్లు నింగిలోకి దూసుకువెళ్లాయి. పీఎస్ 1 ప‌ర్ఫార్మెన్స్ నార్మ‌ల్‌గా సాగింది. పీఎస్‌2 కూడా నార్మ‌ల్‌గా కొన‌సాగింది. పేలోడ్ ఫేరింగ్ కూడా అనుకున్న‌ట్లే స‌రేట్ అయ్యింది. పీఎస్ఎల్వీ బ‌రువు 290 ట‌న్నులు.  ఇవాళ ఉద‌యం పీఎస్‌2 రెండ‌వ ద‌శ‌లో ఆక్సిడైజ‌ర్ ఫిల్లింగ్ ప్ర‌క్రియ‌ను ప్రారంభించారు. ఎర్త్ అబ్జ‌ర్వేష‌న్ శాటిలైట్ EOS-01తో..  వ్య‌వ‌సాయం, అట‌వీ, డిజాస్ట‌ర్ మేనేజ్మెంట్ అప్లికేష‌న్లు ప‌రిశీలించ‌నున్నారు.  న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్ తో కుదుర్చుకున్న ఒప్పందం ప్ర‌కారం క‌స్ట‌మ‌ర్ శాటిలైట్ల‌ను ప్ర‌యోగించారు.అయితే క‌రోనా నేప‌థ్యంలో శ్రీహ‌రికోట్ల క‌ఠిన ఆంక్ష‌లు అమ‌లు చేశారు.  మీడియాకు ఆహ్వానం లేదు. లాంచ్ వ్యూవింగ్ గ్యాల‌రీని మూసివేశారు.