శుక్రవారం 29 మే 2020
National - Mar 29, 2020 , 22:42:45

క‌రోనాపై పోరు కోసం రంగంలోకి ఇస్రో

క‌రోనాపై పోరు కోసం రంగంలోకి ఇస్రో

న్యూఢిల్లీ: దేశంలో క‌రోనా మ‌హ‌మ్మారి రోజురోజుకు విస్త‌రిస్తూనే ఉంది. దీంతో ఈ వైర‌స్ క‌ట్ట‌డి కోసం కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాలు ఎన్నో క‌ఠిన నిర్ణ‌యాలు తీసుకుంటున్నాయి. ఈ నేప‌థ్యంలో సినీ న‌టులు, వ్యాపార‌వేత్త‌లు, పారిశ్రామిక‌వేత్త‌లు, రాజ‌కీయ నాయ‌కులు త‌మ వంతుగా ప్ర‌భుత్వాల‌కు ఆర్థిక సాయం అందిస్తున్నారు. ఇదే సంద‌ర్భంలో భార‌త అంత‌రిక్ష ప‌రిశోధ‌న సంస్థ (ఇస్రో) సైతం త‌న వంతు సాయం చేసేందుకు రంగంలోకి దిగింది. 

తేలిగ్గా ఆప‌రేట్ చేయ‌గ‌ల వెంటిలేట‌ర్లు, ఆక్సిజ‌న్ కెనిస్ట‌ర్లు, శానిటైజ‌ర్లు, మాస్కుల త‌యారీలో ఇస్రో స‌హ‌క‌రించ‌నుంది. అత్య‌వ‌స‌ర ప‌రికాల త‌యారీకి తోడ్పాటును అందించ‌నుంది. ఈ మేర‌కు ఇస్రో డైరెక్ట‌ర్ సోమ్‌నాథ్ వివ‌రాల‌ను వెల్ల‌డించారు.  తమ  అధీనంలోని విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ సులువుగా ఉపయోగించగల వెంటిలేటర్ ను డిజైన్ చేస్తుందని, దాని తయారీ బాధ్యతను ఇతర పారిశ్రామిక సంస్థలే స్వీకరించాలని ఆయ‌న కోరారు. ఇప్పటివరకు తాము 1000 లీటర్ల శానిటైజర్లను తయారు చేశామని, ప్రస్తుతం తమ ఉద్యోగులు మాస్కులు తయారుచేస్తున్నారని సోమ్ నాథ్ తెలిపారు. 


logo