బుధవారం 27 మే 2020
National - May 08, 2020 , 20:03:00

ఢిల్లీ హైకోర్టులో ఇస్లాంఖాన్ బెయిల్ పిటిష‌న్‌

ఢిల్లీ హైకోర్టులో ఇస్లాంఖాన్ బెయిల్ పిటిష‌న్‌

న్యూఢిల్లీ: ఢిల్లీ మైనారిటీ క‌మిష‌న్ చైర్మ‌న్ జ‌ఫారుల్ ఇస్లాం ఖాన్ అక్క‌డి హైకోర్టులో బెయిల్ పిటిష‌న్ దాఖ‌లు చేశారు. తనపై నమోదైన దేశ ద్రోహం కేసులో ముందస్తు బెయిల్ మంజూరు చేయాల‌ని కోరుతూ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. తన ల్యాప్‌టాప్‌ను‌, ఫోన్‌ను పోలీసులు స్వాధీనం చేసుకోకుండా ఆదేశాలు ఇవ్వాల‌ని ఆయ‌న త‌న బెయిల్ పిటిష‌న్‌లో కోరారు. తాను ఎలాంటి నేరం చేయలేదని, పోలీసులు త‌న‌పై త‌ప్పుడు కేసు న‌మోదు చేశార‌ని జ‌ఫారుల్ పేర్కొన్నారు. 

తాను ప్రభుత్వ ప‌ద‌విలో ఉన్నాన‌ని, 72 ఏండ్ల వృద్ధుడిన‌ని, గుండె జ‌బ్బు, అధిక ర‌క్త‌పోటు స‌మ‌స్య‌లు ఉన్నాయ‌ని ఈ కార‌ణాల‌చేత త‌న‌కు బెయిల్ మంజూరు చేయాల‌ని జ‌ఫారుల్ ఇస్లాం ఖాన్ త‌న బెయిల్ పిటిష‌న్‌లో పేర్కొన్నారు. ఇస్లాం ఖాన్‌ తరఫున‌ న్యాయవాదులు వ్రిందా గ్రోవర్‌, రత్న అప్పెండర్‌, సౌతిక్‌ బెనర్జీ పిటిషన్‌లు దాఖలు చేశారు. గ‌త నెల 28న మ‌త విద్వేషాలు రెచ్చ‌గొట్టేలా సోష‌ల్ మీడియాలో కామెంట్లు చేశాడ‌న్న ఆరోప‌ణ‌ల‌తో ఇస్లాంఖాన్‌పై దేశ‌ద్రోహం కేసు న‌మోదు చేశారు. 


logo