సోమవారం 03 ఆగస్టు 2020
National - Jul 28, 2020 , 14:43:18

అవయవదానాన్ని ఇస్లాం ఖండించదు!

అవయవదానాన్ని ఇస్లాం ఖండించదు!

చెన్నై : అవయవదానాన్ని ఇస్లాం ఖండించదని, ఈ ప్రక్రియలో ఎవరికీ హాని జరగనంత కాలం దీన్ని అనుమతించవచ్చని చెన్నైలో ఇటీవల నిర్వహించిన ఇస్లాం ఫోరం ఫర్‌ మోడరేట్‌ థాట్‌ అనే వెబ్‌నార్‌లో వక్తలు అన్నారు. అవయవ దానంపై వివిధ దేశాలు భిన్న అభిప్రాయాలు కలిగి ఉన్నాయని, ప్రపంచ వ్యాప్తంగా ముస్లింలు ఈ విషయంపై విభిన్న సంస్కృతులను అనుసరిస్తున్నారు.  ‘ఒక సాధారణ సూత్రం గుర్తుంచుకోవాలి.. ట్రాన్స్ ప్లాంట్ చేసేటప్పుడు ఎవరికీ ఎలాంటి హాని చేయరాదు. ఒక అవయవానికి పెద్ద మొత్తంలో ఉపయోగం ఉంటే చేసుకోవచ్చని’  అని ఇస్లామిక్ స్టడీస్ ప్రొఫెసర్ ఇబ్రహీం మూసా సెషన్‌లో చెప్పారు. 


‘మిల్కియాత్‌’పై వివరణ..

‘మిల్కియాత్‌’ అంటే ‘దేహం దివ్య యాజమాన్యం’. దీనిపై మాట్లాడుతూ వ్యక్తి శరీరానికి అమర్యాదకరమైన రీతిలో చికిత్స చేయలేరని అర్థం. ‘ప్రజలు తమ చేతులు తెగ తెంపుకోలేరు. తమను తాము గాయపర్చుకోరు. ఒక ప్రాణాన్ని కాపాడడానికి ఒక అవయవాన్ని ఉపయోగించడం అంటే గౌరవం కోల్పోవడం కాదు’ అని మూసా అన్నారు. ‘అవయవ మార్పిడికి ఎక్కువ మందిని చైతన్య పరచడంలో సమానత్వం, పారదర్శకతను నిర్ధారించడం చాలా దూరం వెళ్తుందని ఖతార్‌కు చెందిన యూరాలజీ, ట్రాన్స్‌ప్లాంట్‌ సర్జరీ స్పెషలిస్ట్‌ ప్రొఫెసర్‌ రియాద్‌ ఏఎస్‌ పధిల్‌ పేర్కొన్నారు. అవయవ మార్పిడికి బ్రెయిన్‌ డెడ్‌ను ఒక ప్రమాణంగా తీసుకోవచ్చని చాలా సంస్కృతులు అంగీకరిస్తున్నాయని, ప్రజలు వ్యవస్థను విశ్వసించినప్పుడు, ఎక్కువ మంది అవయవాలను దానం చేయడానికి ముందుకు వస్తారు’ అని అన్నారు. ట్రాన్స్‌ప్లాంట్‌ చేసేటప్పుడు ఎవరికీ ఎలాంటి హాని జరగకూడదని, అవయవదానానికి పెద్ద ప్రయోజనం ఉంటే ఉపయోగించుకోవచ్చని వెబ్‌నార్‌లో వక్తలు పేర్కొన్నారు.


లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.


logo