గురువారం 02 జూలై 2020
National - Jun 21, 2020 , 20:02:25

కరోనాతో ఐఎస్‌ఐ ఉన్నతాధికారి మృతి..

కరోనాతో ఐఎస్‌ఐ ఉన్నతాధికారి మృతి..

క్వెట్టా : కరోనా మహమ్మారి ప్రపంచాన్ని వణికిస్తోంది. ప్రపంచ దేశాధినేతలను, ఉన్నతాధికారులను, ఎవ్వరిని వదలడం లేదు. తాజాగా పాకిస్థాన్‌లోని బలోచిస్థాన్‌ ఇంటర్‌ సర్వీస్‌ ఇంటెలిజెన్స్‌ (ఐఎస్‌ఐ) సీనియర్‌ అధికారి హసన్‌ అఫ్జల్‌ కరోనాతో మృతి  చెందాడు. హసన్‌ బలోచిస్థాన్‌ బ్రిగ్‌ సెక్టార్‌లో ఇంటర్‌ సర్వీస్‌ ఇంటెలిజెన్స్‌ కమాండర్‌గా విధులు నిర్వహిస్తుండగా.. ఈ సమస్యాత్మక ప్రావిన్స్‌లో వైద్య సదుపాయాలు పూర్తిగా లేకపోవడంతో మృతి చెందినట్లు అధికారులు తెలిపారు.

రానున్న నెలలోగా బలోచిస్థాన్‌లో కరోనా కేసుల సంఖ్య 9వేలకు చేరే అవకాశముందని నిపుణులు అంటున్నారు.  కొన్ని నెలల్లో ఇక్కడ దాదాపు లక్ష మంది మృతి చెందే అవకాశముందని బలోచిస్థాన్‌ ఆరోగ్య జనరల్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ సలీమ్‌ అబ్రో ఇప్పటికే మీడియా ఎదుట తన వెల్లడించారు. జూలై నుంచి సెప్టెంబర్‌ వరకు ప్రావిన్స్‌లో కరోనా కేసులు భారీగా పెరిగే అవకాశముందని, 40శాతానిపైగా ప్రజలు ఇప్పటికే ఇన్‌ఫెక్షన్‌ బారినపడ్డారని అబ్రో పేర్కొన్నారు. ఆరోగ్య సంస్థలకు లాక్‌డౌన్‌ విధించాలని సూచించినా.. కనీసం పట్టించుకోకుండాలాక్‌డౌన్‌ను స్మార్ట్‌లాక్‌డౌన్‌గా మార్చాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. పాకిస్థాన్‌లో ఇప్పటి వరకు కరోనాతో చనిపోయిన వారి సంఖ్య 3,436కు చేరింది.  ఇప్పటి వరకు 1,74,676 మంది ఇన్‌ఫెక్షన్‌ బారినపడ్డారు.

  
logo