గురువారం 06 ఆగస్టు 2020
National - Jul 29, 2020 , 02:05:32

అయోధ్యలో ఉగ్రదాడికి పాక్‌ కుట్ర

అయోధ్యలో ఉగ్రదాడికి పాక్‌ కుట్ర

  •  రామజన్మభూమి లక్ష్యంగా పథకం 
  • అప్రమత్తమైన భద్రతాదళాలు 

న్యూఢిల్లీ: వచ్చే నెల 15న అయోధ్యలోని రామజన్మభూమిలో ఉగ్రవాద దాడులు జరుపాలని పాకిస్థాన్‌ గూఢచార సంస్థ ఐఎస్‌ఐ కుట్రలు పన్నుతున్నదని కేంద్ర నిఘావర్గాలు మంగళవారం హెచ్చరించాయి. ఈ మేరకు ఆఫ్ఘనిస్థాన్‌లో లష్కరే తాయిబా, జైషే ఉగ్రవాదసంస్థలకు చెందిన ముష్కరులకు ఐఎస్‌ఐ శిక్షణ ఇస్తున్నట్లు సమాచారం అందిందని తెలిపాయి. దాడి కోసం మూడు నుంచి ఐదు ఉగ్రవాద బృందాలను అయోధ్యకు పంపించటానికి ఐఎస్‌ఐ కుట్రలు పన్నిందని పేర్కొన్నాయి. వీవీఐపీలు లక్ష్యంగా కూడా ఇతర ప్రాంతాల్లో దాడులకు ఐఎస్‌ఐ పథకరచన చేసినట్లు తెలిసిందని ఈ నేపథ్యంలో అయోధ్యతోపాటు ఢిల్లీ, కశ్మీర్‌లలో భద్రతాబలగాలను అప్రమత్తం చేశామని తెలిపాయి. అయోధ్యలో వచ్చేనెల ఐదున భూమిపూజ జరుగనుంది. ఈ కార్యక్రమానికి ప్రధాని మోదీ హాజరు కానున్నారు.


logo