ఆదివారం 29 నవంబర్ 2020
National - Oct 23, 2020 , 13:27:34

హౌడీ మోడీ ఫలితం ఇదేనా? : కపిల్‌ సిబల్‌

హౌడీ మోడీ ఫలితం ఇదేనా? : కపిల్‌ సిబల్‌

న్యూఢిల్లీ : హౌడీ మోడీ కార్యక్రమం ఫలితంగా భారతదేశ గాలి ‘మురికి’గా ఉందని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ అన్నారని కాంగ్రెస్‌ నేత కపిల్‌ సిబల్‌ విమర్శించారు. గురువారం జరిగిన అమెరికా అధ్యక్ష బరిలో నిలిచిన ట్రంప్‌, జోబిడెన్‌ సంవాదంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్యారిస్‌ వాతావ‌ర‌ణ ఒప్పందం నుంచి త‌ప్పుకోవ‌డానికి కార‌ణాలు వెల్లడించిన ట్రంప్‌.. తన నిర్ణయాన్ని సమర్థించుకున్నారు. చైనా దేశాన్ని గ‌మ‌నించండి, ఎంత రోత‌గా ఉందో..  ర‌ష్యాను చూడండి, ఇండియాను చూడండి.. ఆ దేశాల్లో వాయు నాణ్యత చెడిపోయిన‌ట్లు ఆరోపించారు. దాని వ‌ల్లే పారిస్ ఒప్పందం నుంచి తప్పుకున్నట్లు పేర్కొన్నారు. పారిస్ ఒప్పందానికి క‌ట్టుబ‌డి.. మిలియ‌న్ల సంఖ్యలో ఉద్యోగాల‌ను కోల్పోలేన‌ని, వేలాది కంపెనీల‌ను మూసివేయ‌లేమ‌న్నారు. తొలి సంవాదంలోనూ చైనా, భారత్‌ కరోనా మరణాల వాస్తవ సంఖ్య చెప్పడం లేదని ట్రంప్‌ నోరు పారేసుకున్నారు. ఈ క్రమంలో ఆ వ్యాఖ్యలపై కపిల్‌ సిబల్‌ ట్విట్టర్‌ వేదిక ద్వారా స్పందించారు. దేశంలో ‘కొవిడ్‌ మరణాలపై ప్రశ్నలు, దేశంలో గాలి‘మురికి’, భారత్‌ ట్రాఫిక్‌ కింగ్‌’గా ట్రంప్‌ పిలుస్తున్నారని, ఇవన్నీ ఆయనతో స్నేహ ఫలాలేనని ఎద్దేవా చేశారు.


లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.