బుధవారం 27 జనవరి 2021
National - Jan 14, 2021 , 15:19:55

తమిళ సంస్కృతిని కాపాడటం నా బాధ్యత: రాహుల్‌

తమిళ సంస్కృతిని కాపాడటం నా బాధ్యత: రాహుల్‌

చెన్నై: తమిళ సంస్కృతి, భాషను కాపాడటంలో తమిళనాడు ప్రజల వెంట ఉండటం తన బాధ్యతని కాంగ్రెస్‌ నాయకుడు రాహుల్‌ గాంధీ తెలిపారు. తమిళనాడు ప్రజల  ఆప్యాయత, ప్రేమకు తాను పులకించినట్లు చెప్పారు. మదురైకి వచ్చిన రాహుల్‌ గాంధీ గురువారం పొంగల్‌ వేడుకల్లో పాల్గొన్నారు. తమిళ సంస్కృతి, భాష, చరిత్ర భారతదేశ భవిష్యత్తుకు ఎంతో అవసరమని తాను భావిస్తున్నానని అందుకే ఇక్కడకు వచ్చినట్లు తెలిపారు. తమిళ ప్రజలపై కఠినంగా వ్యవహరించాలని, తమిళ భాష, సంస్కృతిని చిన్నచూపు చూడాలనుకునేవారికి వ్యతిరేకంగా సందేశం ఇవ్వడానికే తాను ఇక్కడకు వచ్చినట్లు రాహుల్ గాంధీ చెప్పారు. తమిళ సంస్కృతి, చరిత్రను స్వయంగా చూడటం చాలా మనోహరమైన అనుభవమని అభివర్ణించారు. సురక్షితమైన పద్ధతిలో జల్లికట్టును నిర్వహించడం చాలా సంతోషంగా ఉందన్నారు. అనంతరం రాహుల్‌ గాంధీ స్థానికులతో కలిసి భోజనం చేశారు. 


లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.


logo