శుక్రవారం 27 నవంబర్ 2020
National - Nov 05, 2020 , 15:48:43

మహమ్మారి సమయంలో హోటళ్లలో ఉండడం సురక్షితమేనా?

మహమ్మారి సమయంలో హోటళ్లలో ఉండడం సురక్షితమేనా?

వాషింగ్టన్ : మహమ్మారి సమయంలో హోటళ్లలో ఉండడం సురక్షితమేనా? అంటే.. వైరస్‌ నుంచి రక్షించుకునేందుకు ఇంట్లోనే ఉండడం ఉత్తమ మార్గమని యూఎస్‌ సెంటర్స్‌ ఫర్‌ డిసీజ్‌ కంట్రోల్‌ అండ్‌ ప్రివెన్షన్‌ స్పష్టం చేసింది. స్నేహితులు, కుటుంబ సభ్యులతో కలిసి ప్రయాణం చేస్తే హోటల్‌లో బస చేయడం కంటే అద్దె ఇంటిని తీసుకోవడం సురక్షితమని చెప్పింది. అతిథుల మధ్య 72 గంటల బఫర్‌ కోసం అద్దె ఇండ్ల కోసమే ప్రయత్నించాలని డేవిస్‌లోని కాలిఫోర్నియా విశ్వవిద్యాలయంలో అంటువ్యాధుల నిపుణురాలు డాక్టర్‌ నటాషా టుజ్నిక్‌ చెప్పారు. ఒక వేళ హోటల్‌లో ఉంటే యాజమాన్యం ఎలాంటి భద్రతా చర్యలు తీసుకుంటుందో పరిశీలించాలని సూచించారు. తక్కువ మంది వ్యక్తులు గదిలోకి ప్రవేశించేలా చూసుకోవాలని, హౌస్‌కీపింగ్‌ సేవలు వదిలివేయాలని చెప్పారు. వీలైతే ఎలివేటర్‌కు బదులుగా మెట్లను వాడాలని సూచించారు.


లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.