బుధవారం 12 ఆగస్టు 2020
National - Jul 13, 2020 , 15:41:01

అది పువ్వా.. లేకుంటే పురుగా? వీడియో వైర‌ల్

అది పువ్వా.. లేకుంటే పురుగా?  వీడియో వైర‌ల్

కొన్ని పూలు ర‌క‌ర‌కాల షేప్‌లో ఉంటాయి. అందులో ఆర్కిడ్ పూలు కూడా ఒక‌టి. ఇలాంటి పువ్వు ఒక‌టి క‌దులుతున్న‌ది. అయితే అది గాలికి క‌ద‌ల‌డం లేదు. ప్రాణం ఉండి క‌దులుతున్న‌ది. అదేంటి ప్రాణం ఉండి పూలు పూస్తాయి కానీ, ఇవి ఏకంగా న‌డుస్తున్నాయి కూడా. ఈ విచిత్ర‌మైన పూల వీడియోను ఇండియ‌న్ ఫారెస్ట్ స‌ర్వీస్ అధికారి సుశాంత నందా ట్విట‌ర్‌లో షేర్ చేశారు. ఇప్పుడు ఈ వీడియో నెట్టింట్లో హ‌ల్‌చ‌ల్ చేస్తున్న‌ది.

ఈ పువ్వు క‌ద‌ల‌డ‌డానికి కార‌ణం ఒక పురుగు. ఈ కీట‌కం పువ్వులోనికి దూరి పువ్వులా రూపం మార్చుకున్న‌ది. దీన్ని చూసిన‌ప్పుడు పురుగు అని ఎవ‌రూ అనుకోరు. తెలిసిన వారు త‌ప్ప‌. అంత‌లా మారిపోయింది. 10 సెకండ్ల‌పాటు న‌డిచే ఈ వీడియోలో పురుగు ఆకుపై క‌ద‌ల‌డం చూడొచ్చు. అంతేకాదు ఈ కీట‌కాన్ని ఆర్కిడ్‌ మాంటిస్ అని పిలుస్తారు. ఇది భారతదేశంలోని పశ్చిమ కనుమలలో కనిపిస్తుంది. ఈ వీడియోను ఇప్ప‌టిక‌వ‌ర‌కు 12.4 కే మంది వీక్షించారు. ఇలాంటి కీట‌కాల‌ను ఇప్ప‌టివ‌ర‌కు చూడ‌లేదంటూ నెటిజ‌న్లు కామెంట్లు పెడుతున్నారు.logo