శనివారం 15 ఆగస్టు 2020
National - Jul 22, 2020 , 14:55:09

యూపీలో జ‌ర్న‌లిస్టుగా ప‌నిచేయడ‌మే నేర‌మా?

యూపీలో జ‌ర్న‌లిస్టుగా ప‌నిచేయడ‌మే నేర‌మా?

న్యూఢిల్లీ: ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లో గూండాల రాజ్యం న‌డుస్తున్న‌ద‌ని కాంగ్రెస్ పార్టీ విమర్శించింది. రాష్ట్రంలో జ‌ర్న‌లిస్టులుగా ప‌నిచేయ‌డం నేర‌మా, జ‌ర్న‌లిస్టులేమైనా గూండాలా అని యోగీ ఆదిత్య‌నాథ్ ప్ర‌భుత్వాన్ని ప్ర‌శ్నించింది. ఘ‌జియాబాద్‌లో సోమవారం రాత్రి జ‌ర్న‌లిస్టు విక్ర‌మ్ జోషీపై గూండాలు దాడిచేయ‌డం, ఆయ‌న ఈ రోజు మ‌ర‌ణించిన ఘ‌ట‌న‌పై కాంగ్రెస్ పార్టీ సీనియ‌ర్ నేత ర‌ణ్‌దీప్ సింగ్ సుర్జేవాలా ఉత్త‌ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వంపై మండిప‌డ్డారు.

రాష్ట్రంలో ఆట‌విక పాల‌న న‌డుస్తున్న‌ద‌న‌డానికి విక్ర‌మ్ జోషీపై దాడి ఘ‌ట‌నే నిద‌ర్శ‌నమ‌ని విమ‌ర్శించారు. జ‌ర్న‌లిస్టులేమైనా గ్యాంగ్‌స్టార్‌లా? విక్ర‌మ్ జోషీ పిలిచినా పోలీసులు ప‌ట్టించుకోరా? జ‌ర్న‌లిస్టులు ప‌ట్ట‌ప‌గ‌లే గూండాల చేతిలో చావాలా? అని ప్ర‌శ్నించారు. దీన్నిబ‌ట్టి యూపీలో శాంతి భ‌ద్ర‌తలు ఎంత దారుణంగా ఉన్నాయో అర్థంచేసుకోవ‌చ్చ‌ని వెల్ల‌డించారు. రాష్ట్రంలో జ‌ర్న‌లిస్టుల‌పై త‌ర‌చూ దాడులు జ‌రుగుతున్నాయ‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. 

జోషీపై దాడిని కాంగ్రెస్ పార్టీ సీనియ‌ర్ నేత‌, ఎంపీ రాహుల్ గాంధీ ఖండించారు. ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లో గూండా రాజ్యానికి ఇది నిద‌ర్శ‌న‌మ‌ని విమ‌ర్శించారు. జోషి మృతిపై ఆయ‌న కుటుంబ స‌భ్యుల‌కు ప్ర‌గాఢ సానుభూతి తెలిపారు.


logo