బ్రిటన్కు ఇప్పుడు విమానాలా?: కేజ్రీ ఆందోళన

న్యూఢిల్లీ: కరోనా వైరస్ న్యూ స్ట్రైయిన్తో బ్రిటన్ సతమతమవుతున్నదని, ఇటువంటి విపత్కర పరిస్థితుల్లో ఆ దేశానికి విమాన సర్వీసులపై విధించిన నిషేధాన్ని కేంద్ర ప్రభుత్వం ఎత్తివేయడమేమిటని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఆందోళన వ్యక్తంచేశారు. శుక్రవారం నుంచి బ్రిటన్కు విమాన సర్వీసులను పునఃప్రారంభించాలని కేంద్రం నిర్ణయం తీసుకున్నది. ఈ నిర్ణయాన్ని కేజ్రీవాల్ తప్పుబట్టారు.
బ్రిటన్లో కరోనా స్ట్రెయిన్ వైరస్ పరిస్థితి చాలా తీవ్రంగా ఉందని పేర్కొన్నారు. కనుక బ్రిటన్కు విమాన సర్వీసులను పునరుద్ధరించడంపై కేంద్రం విధించిన నిషేధాన్ని జనవరి 31వ తేదీ వరకు పొడిగించాలని కోరుతూ గురువారం ట్వీట్ చేశారు. దేశంలో అతి కష్టం మీద కరోనా పరిస్థితి అదుపులోకి వచ్చిందని గుర్తు చేశారు. బ్రిటన్లో కరోనా పరిస్థితి దారుణంగా ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో విమానాలపై నిషేధం ఎత్తివేసి ప్రజలను ప్రమాదంలోకి నెట్టడం ఎందుకని కేంద్రాన్ని కేజ్రీవాల్ ప్రశ్నించారు.
మరోవైపు, బ్రిటన్లో కొత్త స్ట్రెయిన్ కలకలం నేపథ్యంలో డిసెంబర్ 22 నుంచి 31 వరకు విమాన సర్వీసులపై కేంద్రం నిషేధం విధించింది. అయితే, అక్కడి పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని ఈ నిషేధాన్ని గురువారం వరకు పొడిగిస్తూ ఇటీవల కేంద్రం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే.
లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
తాజావార్తలు
- మరో నాలుగు రోజులు..
- గ్రామాల అభివృద్ధేప్రభుత్వ ధ్యేయం
- ‘పట్టభద్రుల’ ఓటర్లు 4,91,396
- నేటి నుంచి నిరంతరాయంగా..
- ఆకాశం హద్దుగా!
- పట్టణాన్ని సుందరంగా తీర్చిదిద్దుతాం
- కోడేరు అభివృద్ధ్దికి కంకణం కట్టుకున్నా
- ప్రభుత్వభూమి ఆక్రమణపై హైకోర్టును ఆశ్రయిస్తాం
- కాళేశ్వరంలో మళ్లీ జలసవ్వడి
- నల్లమల ఖ్యాతి నలుదిశలా విస్తరించాలి